ఈ లోపల ఒక స్త్రీ పాత్ర వొచ్చింది. 'ఏంటి పరాంకుశం కనిపించాడా? దేవుడు ఉన్నాడురా, నా పూజలు ఫలించాయి, వెంటనే వాడి రక్తం కళ్ళ జూడాలి.' అంటూ కాసేపు నవ్వింది, కాసేపు ఏడిచింది, కాసేపు ఉద్వేగంగా తల బాదుకుంది, జుట్టు పీక్కుంది.
(చూస్తున్న నాకు పిచ్చెక్కుతోంది, రక్తం కళ్ళ జూడలా, ఉండు, accucheck నీడలే తో వాడి వేలు పొడిచి చూపిస్తా, అనుకున్నాను మనసులో)
ఇంతలో పుత్ర రత్నం వొచ్చాడు,' బామ్మా, ఎందుకె అంత పగ?' 'వాడికి ఐదేళ్ళు ఉన్నప్పుడు నా చీర పట్టుకున్నడురా! అంటే, ఆరేసిన చీర గాలికి ఎగిరిపోతే పట్టుకోచ్చడురా, అంది పళ్ళు నూరుతూ' , ఈ లోపల నాన్న పాత్ర అందుకుంది. 'అంతే కాదురా వాడు చిన్నప్పుడు నా బలపం తినేసాడురా, అన్నాడు పిడికిలి బిగిస్తూ'
(ఒరే బాబు, నీకో బలపాల ప్యాకెట్ కొనిస్తాను, క్షమించేయ్యరా, అనుకున్నాను మనసులో)
'ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు నాన్న, వాడి అంతు చూసే దాకా నేను స్నానం చెయ్యను', అన్నాడు పుత్ర రత్నం emotion క్యారీ చేస్తూ.
(స్నానం చెయ్యకపోతే, కంపు కొట్టి చస్తావురా, చవటాయ్, అనుకున్నాను మనసులో)
ప్రేక్షకులు మంత్ర ముగ్దుల్లా చూస్తున్నారు. నాకు పారిపోవాలని అనిపించింది. అవసర సమయాల్లో నా బుర్ర పాదరసం లాగ పని చేస్తుంది. ఫోన్ లో fake కాల్ అచ్తివాతే చేసి, హలో, అంటూ బయటపడ్డాను.
మనసులో ఆలోచనలు, అసలు ఈ సీరియల్స్ ఏమి చెప్పాలనుకుంటున్నాయి? మనుషుల్లో క్రోధాన్ని, పగని, చెడు ద్రుక్పదాలని ప్రచారం చేస్తున్నాయి. సరే, మనం ఏమి చేస్తున్నాం? ఎప్పటి సంగతులో సాగాదీసుకుంటూ వాళ్ళని, వీళ్ళని విమర్శిస్తూ జీవితాలు గడిపెస్తున్నాం. తరం నుంచి తరం అంతరాలు పెంచుకుంటున్నాం. ఈ పగలతో, పంతాలతో, ఆశయాలతో మనం ఏమి సాధించాం? క్షమించడంలో దైవత్వం ఉంది, ద్వేషించడంలో
దానవత్వం ఉంది.
మిత్రులారా, ఈ చిన్ని జీవితంలో, ఇన్ని ఉద్వేగాలు అవసరమా? మనసులో కూడా ఎవరిని ద్వేషించాకండి .అంతర్లీనంగా, చిన్న సైజు factionist ల లాగ మీరు మోస్తున్న పగలు, ద్వేషాలు వీడండి. సంతోషంగా నవ్వుతూ, నవ్విస్తూ ఉండండి. సీరియల్స్ బదులు మంచి సంగీతం వినండి, మిత్రులతో మాట్లాడండి, మంచి సాహిత్యం చదవండి. ప్రతి రోజు మనిషికి పునర్జన్మ. ఏ మనిషి పూర్తిగా మంచివాడు కాదు, పూర్తిగా చెడ్డవాడు కాదు. నా వరకు నేను ప్రతి వారి నుంచి నేర్చుకోవలసిన సుగుణం ఒక్కటయినా ఉంటుందని నమ్ముతాను. ఆ నేర్చుకున్న విషయాన్నీ పదిల పరచుకుంటాను. అప్పుడే వ్యక్తి మానసికంగా ఎదిగేది.
No comments:
Post a Comment