Wednesday, March 13, 2013

నాయకుల కిటుకులు






ఎంతటి మాయ...ఎంతటి గారడీ...

ఈ నాయకులు చేసే పనులు అన్నిటి వెనుకా గొప్ప రాచకోట రహస్యాలు దాగి ఉన్నాయండీ. పర్లేదు, మరేం భయం లేదు, నేనున్నాగా, అసలు తిరకాసు ఏవిటో మీకు చెపేస్తా!

౧) పాద యాత్రలు : వాకింగ్ అన్ని అనారోగ్యాలకు మందులా పని చేస్తుంది. అందుకే, ఒకళ్ళ తరువాత ఒకళ్ళు అలా పాదయాత్రలకు బయలుదేరుతున్నారు. పెట్రోల్ ఖర్చు, డీసిల్ ఖర్చు లేదు. ప్రచారానికీ కాని ఖర్చు లేదు. వాళ్లకు ఆరోగ్యం - వాళ్ళ కోసం వేచి, వేచి, జనాలకు అనారోగ్యం. చూసారా, ఒకేసారి స్వామి కార్యం....ప్రచారం; స్వకార్యం...కొవ్వు తగ్గించుకుని నవ నవ లాడే ఆరోగ్యం....అదన్నమాట.

౨) నిరాహార దీక్షలు : 'లంఖణం పరమౌషదం' అన్నారు కదండీ పెద్ద వాళ్ళు. అలా అన్నం తినకుండా అలిగి ప్రజలు, ప్రభుత్వ సానుభూతి పొందవచ్చు, ఇలా కడుపులో అప్పటిదాకా పడేసిన పదార్ధాలన్నీ అరిగేందుకు, కడుపుకు కాస్త విరామం ఇవ్వచ్చు...గొప్ప అవిడియా కదూ....

౩) పార్టీలు మారడం : 'ఇంటి గుట్టు లంకకు చేటు ' అన్నరుకదండీ. ఎదుటి పార్టీ వాళ్ళ ఎత్తులు, కుతంత్రాలు తెలియాలి...అప్పుడే పై ఎత్తులు వెయ్యొచ్చు. మరి తెలుసుకోవడం ఎలా? అడిగితే,,,,చెప్తారా ...ఆ చెప్తారు..వాళ్ళు అమాయకులేంటి ? అందుకే, మన పార్టీ లో ఉన్న అనుకూల నేస్తంతో మీడియా ముందు గొడవపడి, అడిగి మరీ బండ బూతులు తిట్టించుకుని, ఎదుటి పార్టీ లోకి పంపుతారు. వాళ్ళు, పోనిలే, మన వాడే కదా, అని గుట్టు మట్టులన్నీ చెప్తారు. అవి మళ్ళీ వీరు వారికి మోస్తారు. ఇలా అన్ని పార్టీలలో తమ గూడచారులను పెడితే, ఎన్నికల్లో విజయం ఖాయం.....చాణక్య నీతి . అందుకే సుమా, వీళ్ళు కొమ్మ మీది కోతుల్లా, పార్టీలు మారేది. 

అసలు మనం అనుకుంటాం గాని, వీళ్ళ కంటే అవిడియా లు వేసే సర్ జి లు లేరండీ. మనల్ని బురిడీ కొట్టించటమే, వీళ్ళ తక్షణ కర్తవ్యమ్. నమ్మద్దు సుమీ....

No comments:

Post a Comment