ఒకతను, మానసిక వైద్యుడి దగ్గరకు వెళ్లి, ఇలా మొరపెట్టుకున్తున్నాడు,' డాక్టర్
గారు, ఎన్నో రోగాలు వినీ, వినీ చిన్న మెదడు చితికి పోయి ఉంటారు, మీరు. అయినా
నాకున్న వ్యాధి వంటిది విని ఉండరు. నాకు ఆకులు చూస్తే, వెంటనే తినెయ్యాలని

అనిపిస్తోంది, చుట్టూ పక్కల వాళ్ళు ఇలా చూస్తున్నా, సిగ్గు పడకుండా
తింటున్నాను. దయ చేసి ఈ అలవాటు మాన్పించండి,' అన్నాడు.
వైద్యుడు,' ఇదేమంత పెద్ద విషయం కాదండి, అన్నట్టు, మీకు ఈ జబ్బు చిన్నప్పటి
నుంచే ఉందా?' అంటూ అడిగాడు. 'అడిగారూ, అదో పెద్ద కదండీ, వినండి,' అంటూ
మొదలుపెట్టాడు.
ఒక రొజు మా ఫ్లాట్స్ లో ఉచితంగా ఆరోగ్య పరీక్షలు, అంటే, వెళ్లి షుగర్
చూపించుకున్నా. చాలా ఎక్కువ ఉంది, వెంటనే, వైద్యుడిని కలవండి, లేకపొతే, మీ
మిగిలిన అవయవాలకి గారంటీ లేదు అన్నారు. వైద్యుడు అన్నీ పరీక్షలు
చేసి,టాబ్లెట్, డైట్ చార్ట్ ఇచ్చి, క్రమం తప్పకుండా వాకింగ్ చెయ్యమన్నారు.
పొద్దుటే, టీవీ లో పొడుగు లాగు తొడుక్కు వచ్చే బక్క పలుచ మనిషి వ్యాయామాలు,
యోగ, క్ర్యం న్యూస్ చెప్పినట్టు, కొమ్మ చేతిలో పట్టుకుని,' ఈ కొమ్మ తినకపోతే
చస్తావురా, అప్రాచ్యుడా!'అంటూ భీబత్సంగా చెప్పే వైద్యుడి సలహాలు, అన్నీ
పాటించడం మొదలుపెట్టాను. పంచదార చిలకను దాచుకున్నంత పదిలంగా, ఈ 'పంచదార జబ్బు'
దాచుకోవాలని తెలియని నేను, అందరికీ చెప్పేసాను. దాంతో అందరూ రక రకాల చిట్కాలు
చెప్పడం మొదలెట్టారు. అసలు, ఈ చిట్కాలు చెప్పే వాళ్ళు అందరిని చితగ్గొట్టి
చంపెయ్యలని, నా గట్టి నమ్మకం. కొందరు వేపాకులు తినమన్నారు, కరివేపాకులు
తినమన్నారు. కొందరు బిల్వ పత్రాలు, తులసి ఆకులు, రాత్రంతా నాన బెట్టిన నేరేడు
ఆకులు, నేల ఉసిరి ఆకులు, మెంతి ఆకులు, ఇలా రక రకాల ఆకులు తినమని చెప్పే వారు.
నా మీద అత్యంత శ్రద్ధ కళ నా భార్య, అన్నీ ఆకులు సిద్ధం చేసి ఉంచేది. నమ్మదిగా,
ఆహరం కంటే, ఆకులు అలములూ తినడం అలవాటయ్యింది. ఇప్పుడు ఉదయం వాకింగ్ కి
వెళితే,' యే ఆకులో యే మందుందో...' అనుకుంటూ, కనబడిన ఆకులన్నీ కోసుకు
తినేస్తున్నాను. ఫ్రిజ్ లోని కరేపాకు, ఆకుకూరలు, కొత్తిమీర, చివరికి కాబెజ్
కూడా తినేస్తున్నాను. మొన్న ఒకాయనకి సన్మానం అని దండ తెచ్చిచేతిలో పెడితే,
సన్మానం లోపే,ఆ ఆకులన్నీ తినెసాను. పెళ్ళికి వెళ్లి తమలపాకులు, అలంకరించిన
ఆకులు తినెసాను. జనాలు నన్ను మనిషి రూపంలో ఉన్న నేమేరేసే గేదెని చూసినట్టు
చూస్తున్నారు. మీరే రక్షించాలి,' అన్నాడు.
' మీ చెవుల్లో సీసం పోస్తాను, అప్పుడు సలహాలు వినే, బాధ తప్పుతుంది. ఆకులనేవి
మీ కంట పడకుండా చూసుకోండి. కొన్నాళ్ళు టీవీ, పేపర్లు చదవకండి. మంచి సంగీతం
వినండి, మరి నా మడులు, డాక్టర్ ఫీజు చూసాకా, మీరు ఆకులు కాదు కదా,
బెంగేట్టుకుని, అసలు తినడమే మానేస్తారు సుమీ,' అని అభయం ఇచ్చాడు వైద్యుడు.

No comments:
Post a Comment