Wednesday, March 13, 2013

లావొక్కింతయు



అసలు అమ్మలు ఎందుకు లావేక్కుతారట? చదవండి, మీకే తెలుస్తుంది.
కడుపుతో ఉండగానే, బలమయిన ఆహారం తినాలని, బిడ్డకి తల్లి ఇచ్చే అమూల్య వరం
ఆరోగ్యమేనని, కబుర్లు చెప్పి, బుజ్జగించి, వేరుసేనక్కాయలు, మొక్క జొన్న
పొత్తులు, పాలు- పళ్ళు, ఆకుకూరలు, పోషకాహారాలు అన్నీ పెట్టేస్తారు. బరువు
పెరిగామా లేదా అని చూసి మరీ తిట్టేస్తుంది, డాక్టరమ్మ. ప్రసవం తరువాత
బాలింతరాలివి, బాగా తినాలి, అంటూ మళ్లీ కూరేస్తారు. బిడ్డ ఎదిగి, ఐదు నెలలు
వచ్చేసరికి అసలు తిప్పలు మొదలు. సెరెలాక్, వేయించి దంచిన బియ్యం-పప్పు మాంచి
నెయ్యి దట్టించి, కలుపుతారు. కార్రోట్, ఆపిల్, అరటిపండు, వంటి బలవర్ధక మయిన
ఆహారం మాష్ చేసి, పెడదామని చూస్తారు. అయితే, ఎల్లలు తెలియని అమ్మ ప్రేమతో,
రెండు చెంచాలు మాత్రమే తినే చిన్నారికి గిన్నె నిండా ఆహారం సిద్ధం చేసుకు
వస్తుంది అమ్మ. బిడ్డ రెండు చెంచాలు తిని, ఏడుపు లంకిన్చుకుంటుంది.
ప్రతిఘటిస్తుంది. అయ్యో, బిడ్డ తినలేదే, అన్న బాధతో, వేస్ట్ చెయ్యడం ఎందుకు,
అన్న భావనతో అమ్మే తినేస్తుంది. అలా మిగిలిపోయిన పోషకాహారం అంతా, విడతలుగా,
పొద్దుటి నుంచి తినీ, తినీ, అమ్మలు కూడా లావేక్కుతారు. అదన్నమాట.
మరి ఐశ్వర్యా రాయి లావేక్కిందంటే, ఎక్కదు మరీ!

No comments:

Post a Comment