ముళ్ళపూడి వారు చెప్పిన 'ముక్కు' కధ...
పెద్ద బుర్రముక్కున్న ఒకాయన - చుట్టాలింటికి భోజనానికి వెళ్ళాడు .
ఆ ఇంటి బుడుగు - నోటికొచ్చిన మాట పెల్చేస్తాడు - అంతకుముందు ఓ సారి - వాళ్ళింటికి వాళ్ళ నాన్న కంపెనీ మేనేజర్ వచ్చాదు. కూర్చుని - నెత్తిమీద టోపీ తీసి పక్కన పెత్తదు. ఆయనకి జుట్టు లెదు.
ఆ పిల్లాడు చూసి, " ఓర్నీ! విగ్గు లేని బోడిగుండు యముడు !" అన్నాడు .
ఆయన - ముందు షాక్ తిన్నా, నవ్వెసాడు.
ఇంటావిడ హన్నా, అని కోప్పడుతుంటే, - " ఉన్నమాటే అన్నాడు కదమ్మా, " అని నవ్వేసాడు .
ఈ సారి వచ్చేది బుర్రముక్కు ఆయన. ఇల్లాలు పిల్లాడిని హెచ్చరించింది. 'చుట్టం గారి ముక్కు గురించి ఏమీ అనకూడదు- అంటే చితక్కోట్టేస్తా...అనకుండా ఉంటే అర్ధణా ఇస్తా, ' అని ఆశ పెట్టింది.
భోజనాలు అవుతున్నాయి.
ఇల్లాలు - చుట్టం గారి ముక్కును, పిల్లాడి మొహాన్ని చూస్తూ - వాడిని కళ్ళతోనే హెచ్చరిస్తూ వడ్డన చేస్తోంది .
పప్పు, కూర, పచ్చడి వాయలు అయిపొయాయి. ఇంక పులుసూ, పెరుగూ రెండే !
'దేవుడా, కాపాడు, పిల్లాడి నోరు కుట్టేయ్ ,' అని మొక్కుతూ వడ్డన చేస్తోంది .
ఆయన పులుసూ అన్నం తిని లోట్టవేసాడు .
'దప్పళం అద్భుతం తల్లీ- ఇది ముందే తెలిస్తే - కూరా గీరా మానేసి అన్నమంతా పులుసే వేసుకునేవాడిని,' అంటున్నాడు .
ఆవిడ మురిసిపోయింది .
పిల్లాడు వింటున్నాడు - ఏం కూస్తాడో అని భయపడుతూ మళ్ళీ పులుసు గోకర్ణం పట్టుకొచ్చింది .
ఆవిడ బుర్ర నిండా బుర్రముక్కే .....
" అన్నయ్యగారు, మీ ముక్కులోకి ఇంకొంచెం పులుసు వెయ్యనా !" అంది వినయంగా . ( అన్నంలోకి అనబొయి...)
No comments:
Post a Comment