Wednesday, March 13, 2013

నేటి జోల పాట





అసలు ఈ అపార్ట్ మెంట్ లను ఎవడు కనిపెట్టాడో కాని, కనిపిస్తే కాల్చి పారెయ్యాలి. అద్దె కొంపల్లో అయినా, హాయిగా గాలి, వెలుతురూ 
పీల్చుకుంటూ, ఉదయం, సాయంకాలం డాబా ఎక్కి, సూర్యుడు, చంద్రుడు, పిల్ల గాలి, నక్షత్రాలు పొదిగిన ఆకాశాన్ని చూస్తూ బ్రతికేసే వాళ్ళమా...ఇప్పుడు, అగ్గిపెట్టి లో పుల్లలు కూరినట్టు, ఈ దిక్కుమాలిన ఫ్లాట్స్ లో మగ్గిపోవాల్సి వస్తోంది. మరి...చందమామ రావే, జాబిల్లి రావే అనే రోజులు పోయాయి తల్లులకి....ఆధునిక పాట నేర్చుకోవాలమ్మా అందరూ....ఇదిగో, బట్టి పట్టి, పాడేయ్యండి ...మీ పిల్లలు అన్నం తినకపోతే అడగండి.


చోటా బీమ్ రారా...అంగ్రి బర్డ్స్ రావే...
డోరేమోన్ రారా..బార్బీ బొమ్మ రావే...
చించాన్ రారా....కితెరేత్సు రారా...

సాటిలైట్ ఎక్కి రారా...సుత్తి కధలు తేరా...
కేబుల్ ఎక్కి రారా...కబుర్ల నస తేరా...
డిష్ ఎక్కి రావే ....డొక్కు డైలాగ్ లు తేవే...
టీవీ లోకి రారా ...తైతక్క లాడరా ...

పైడి గిన్నె లోనా గాడ్జేట్స్ తేరా... 
వెండి గిన్నేలోనా సాహసాలు తేరా...
ఓవెన్ బౌల్ లోనా బార్బీఫాషన్ తేవే...
చించాన్ తోటి చిందులన్ని తేరా...
లాగి  పెట్టి పేల్చే అంగ్రి బర్డ్స్ ఆట తేవే...
ఐపాడ్ రావే....ఐ ఫోను రావే...
అన్నీ తెచ్చి ఈ - పిల్లలకు ఇవ్వవే.

ఇప్పుడు ఎక్కడ చూసినా, పిల్లలకు అన్నం పెట్టాలంటే టీవీ, మొబైల్, లేక ఐపాడ్, గేమ్స్ ఇవ్వాల్సిందే! చివరికి హోటల్ కు వచ్చినా, ఫోన్ ఇచ్చి, వాళ్ళు ఆటల్లో నిమగ్నమై ఉండగా కూరేస్తున్నారు. కనీసం ఏమి తిన్నారో కూడా పిల్లలకు తెలియట్లేదు. ఒకళ్ళని చూసి, మరొకరు మొండికేసి కొనిపించుకుని మరీ ఆడుతున్నారు. మన పిల్లల్ని యంత్రాల్లా పెంచే ,ఈ స్థితి తప్పట్లేదు. ఎంతో శోచనీయం....అయినా, కటువైన వాస్తవం ఇదే. ఎవరి పిల్లల్ని వారు ఏమార్చే ప్రయత్నం మాత్రం మానకూడదు. రత్నాల లాంటి మన పిల్లల్ని, పరాయి సంస్కృతీ పంచన పెంచుతూ  మట్టి బెడ్డలుగా మార్చకూడదు. జాగ్రత్త సుమీ.....


No comments:

Post a Comment