Thursday, March 14, 2013

పార్టీ టైం




గొప్ప వారింట్లో పిల్లి పుట్టినరోజు కుడా, వేడుకే కదండీ. అందుకే, ఒక
ప్రముఖుడు, వారింట్లోని పెంపుడు పిల్లి పుట్టినరోజుకు, అందరినీ ఆహ్వానించాడు.
మరి పార్టీ నేపధ్యం(థీమ్) 'ఆది మానవుడి' పార్టీ విధానం. ఇదేదో చాలా కొత్తగా
ఉందే, అనుకున్న ఆహ్వానితులంతా, చాలా ఉత్సాహ పడ్డారు. అందులో, మరీ కాస్త,
కడుపుబ్బరం ఎక్కువ ఉన్న పెద్దాయన, పార్టీకి పిలవగానే, 'బాబు, మనిషి,
ఆదిమానవుడి నుంచి పరిణామం చెంది వచ్చడు కదా, ఇప్పుడు వెనక్కి వెళ్ళడం,
...ఏంటో...పురోగమనం నుంచి తిరోగమనం అవుతుందేమో'...అన్నాడు సందేహంగా. 'It's all
fun, Uncle', అన్నట్టు, డ్రెస్ కోడ్, గ్రీన్ డ్రెస్ కి ఆకులు కట్టుకు రావాలి.
ఆడవాళ్ళు, మేడలో, చెవులకి, ఈకలు, కోయ పూసలు వేసుకోవాలి. పిల్లలు, వొంటికి నల్ల
రంగు వేసుకుని, పులి చర్మం డ్రెస్, ఆకుల కిరీటాలు పెట్టుకోవాలి. హబ్బ,
తలచుకుంటేనే, ఎంతో ఉత్సాహంగా ఉంది, తప్పక రండి', అని ఫోన్ పెట్టేసాడు.
ఇంక జనాలు బట్టల షో రూం ల మీద పడ్డారు. ఎవరికి వారే page3 లో ప్రత్యేకంగా
కనిపించాలని, 'ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి' లాగ హైరానా పడిపోయారు.
మొత్తానికి ఎలాగో, బట్టలు, పూసలు అయ్యాకా, పావురాల ఈకలు, నల్ల రంగు డబ్బాలు
తెచ్చుకుని, క్రోటన్ మొక్కల రంగు రంగు ఆకులు దండలు కట్టుకుని, పులి చర్మాలు
అద్దెకు తెచ్చుకుని, తయారయ్యారు. పార్టీ రొజు సాయంత్రం, వాళ్ళ ఇంటికి
వెళ్లేసరికి, పెద్ద పెద్ద గుహలు, చెట్ల కట్ అవుట్ లు ,అలంకరించి, వాళ్ళ
ఇంటినే, అడవి చేసి వదిలిపెట్టారు. మైక్ లో జోరుగా అడవి పాటలు
వినిపిస్తున్నాయి...'జుమ్బాక జుమ్బాక హో హో...'అంటూ విచిత్ర మయిన శబ్దాలు.
పెద్ద పెద్ద అడవి బొమ్మల తెరలు, విచిత్ర అలంకారాలు, వాళ్ళ పిల్లికి కూడా ఆకులు
కట్టి, అందరికీ కనిపించేలా, చెట్టు కొమ్మకు, బుట్ట కట్టి, అందులో
కూర్చోపెట్టారు. అందరూ, పిల్లి దగ్గరకు వెళ్లి, 'వావ్, ...సో క్యూట్....' అంటూ
దాన్ని ముద్దు చేసేసారు. వాళ్ళ అవతారాలు చూసి, పిల్లి హడిలిపోయి,
బిక్కచచ్చిపోతోంది. ఈ లోపల ఆకులు కట్టుకుని, ఈకలు పెట్టుకున్న విదేశి భామలు,
బొచ్చేల్లో, జుంటి తేనె తీసుకు వచ్చారు. ఎవరికి వారే,' హమ్మో, బొచ్చేల్లో ఇంత
తేనె తాగితే, బాల్చి తన్నడం ఖాయం,' అనుకున్నారు. ఇంకో భామ ఆకుల్లో పచ్చి మాంసం
ముక్కలు తెచ్చింది. వచ్చిన వాళ్ళకి కడుపులో తిప్పింది. మరో యువకుడు, ఆకులు,
అలములు, కందమూలాలు, ఫలాలు పట్టుకొచ్చాడు. జనాలు, ఇదొక్కటే తినేట్టు ఉందని, వరద
బాదితుల్లా ఎగబడ్డారు. అందరికీ, దోన్నేల్లో, మంచి నీళ్ళు పెట్టారు. కాసేపటికి,
అందరికీ, బల్లాలు ఇచ్చి, అడవి నృత్యం చెయ్యమన్నారు. ఒక లయ, పధ్ధతి లేకుండా,
కూతలు కూస్తూ, అడ్డదిడ్డంగా, నృత్యం చేసారు. తర్వాత, 'విల్లంబుల' గేమ్.
ఎదురుగా, గోడ మీద ఉన్న వస్తువుని, గురి చూసీ కొడితే, బహుమతి, అన్నారు. ఈ
సందడిలో, కేకు వచ్చింది. పెద్ద కండ దుమ్పకి, రక రకాల రంగుల పచ్చి కూర ముక్కలు
అంటించి తెచ్చారు. అది తింటే, నాలిక, గొంతు, దురదే అని తెలిసిన వాళ్ళంతా,
దిగాలు పడిపోయి, అది కనిపించనీయకుండా, 'ప్లాస్టిక్ నవ్వులతో', వింత పదాల
హ్యాపీ బర్త్డే పాట పాడారు. విందులో కంద కేకు, మేక పాలు, కాల్చిన పచ్చి మాంసం,
ఉడకబెట్టిన వేరుసేనగలు, కాల్చిన చిలగడదుంపలు, గంజి, విప్ప సార, అందించారు.
'ఫీల్ అట్ హోం, హౌ ఇస్ ద డిన్నర్?' అంటుంటే, అంత ఖర్చు పెట్టి ఇంత చెట్టా
పార్టీ కి వచ్చినందుకు, మింగలేక, కక్కలేక, ఉన్న జనాలు, 'ఇంకా నయం, మా ముత్తాతల
తాతలు కోతులు...' అంటూ కోతుల పార్టీ పెట్టాడు కాదు, ఎలుగుబంటి మోహము
వాడూను...అనుకుంటూ....'గ్రేట్ ఐడియా,...హవింగ్ ఫున్....మేమోరబల్ ...'
అంటున్నారు. చివరగా, ఆహుతులందరికీ, బహుమతులు ఇచ్చారు. అందరూ పిల్లిని దీవించి,
ఇళ్ళకు వెళ్లారు. కనీసం బహుమతి అయినా దక్కిందని, చూసిన వాళ్ళకి, అందులో ఏమి
కనిపించిన్దనుకున్నారు? కొమ్ము బూర, మూలికలు...
మరి ఎవరన్నా నా పార్టీ నేపధ్యాన్ని కాపీ కొట్టేస్తే ఊరుకోనన్డోయ్ ....

No comments:

Post a Comment