Wednesday, March 13, 2013

పార్టీలు - వోటు గుర్తులు





అసలు పుట్ట గోడుగుల్లాగా ఇన్ని పార్టీలు పుట్టుకోస్తున్నాయే...దేనికి వోటు వెయ్యాలో కూడా తెలియట్లేదు. మీరేమన్నా...సలహా ఇస్తారా...అంటూ రహస్యంగా వీళ్ళని అడిగాను, మీరే చదవండి, వీరి జవాబులు....

సూర్యుడు -- ప్రజారాజ్యం....వేరే పార్టీ లో విలీనం అయిపోయినా సరే, ఆ పార్టీ లోగో లో తన బొమ్మ ఉందంటున్నారు.

చంద్రుడు -   లోక్ సత్తా కే ఈయన వోటు వేస్తారట, అందులో...'తార' , నక్షత్రం ఉందిట.

భూమి --మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కజ్హగం --- వీళ్ళ పార్టీ గుర్తు బొంగరం. తన లాగే గుండ్రంగా తిరుగుతుందని, భూమి వోటు బొంగారానికే వేస్తుందట.

 వాన -   సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ - పార్టీ గుర్తు గొడుగు... వానొస్తే గొడుగేసుకు వెళ్ళవచ్చని..

నీళ్ళు  - రాష్ట్రీయ లోక్ దళ్...చేతి పంపు గుర్తు వీళ్ళది...పంపు కొడితే నీళ్ళు వస్తాయిట.

ఇక 'గాలి' మాత్రం తనకు అంత పేరు పెచ్చిపెట్టిన 'గాలి' ఎన్నికల్లో నిల్చునే దాకా చస్తే వోటు వెయ్యదట. అదండీ సంగతి.




No comments:

Post a Comment