పారోడి |
ఒకప్పుడు బొంగురు గొంతు ఉన్న వాళ్ళు పాట పాడడానికి, సంగీతం నేర్చుకోవడానికి, భయపడే వాళ్ళు. నాకు బాగా గుర్తు,'బామ్మా, ఒక పాట పాడవా?', అని అడిగితే, 'చిన్నప్పుడు, నీ బారసాలకి పాట పాడితే, గాడిద వొచ్చిందే, నా గొంతుకి. అనవసరంగా గాడిదలని కలవర పెట్టడం ఎందుకు చెప్పు?' అనేది. మరి ఇప్పుడో, బొంగురు గొంతు
వెరైటీ, ముక్కుతో పాడితే వెరైటీ.
Remix రాజు గారిని పట్టుకుని , 'అసలు ఈ రిమిక్ష్ అనే ఆలోచన ఎలా పుట్టినదంటారు?' అని అడిగితే, 'మరేమీ లేదండి, చిన్నప్పుడు మా ఇంట్లో రికార్డు అరిగిపోయినప్పుడు, సాగదీసినట్టు, బొంగురు పోయినట్టు వినిపించేవి. ఇదొక ప్రేరణ. మా తమ్ముడికి నత్తి ఉంది. వాడు నెత్తిన ఒక్కటి కొట్టే దాకా 'దంచవే మేనత్త కూతురా పాటని, ద .ద దన్ ..అని పాడుతుంటే వెరైటీ గా అనిపించింది. మరి ఇంకో చెల్లెలికి షార్ట్ టర్మ్ మెమరీ లాస్. పాట చేతికి ఇచ్చేదాక, అదే పల్లవి పాడుతూ ఉండేది. మా మేనల్లుడు ఉండుండి, నక్క ఊళ పెట్టినట్టు, చెయ్యి ఎవరో కరిచినట్టు, వింత కూతలు కూసేవాడు. ఇంక వీటన్నిటితో పాటు పిల్లలు గిన్నెల మీద చెంచాలు, గరిటలు వేసి కొడుతూ,వింత శబ్దాలు చేస్తుంటేను, కూతలు కూస్తుంటేను,ఆ కొలహలానికి చుట్టుపక్కల అందరు పోగయ్యేవారు. అలా రెమిక్ష్ పుట్టింది.' అని కళ్ళు తెరిపించారు.
సినిమా పాటకి, ఏదో సరదాగా మరో సాహిత్యం బట్టతల మీదో, కదలని ట్రైన్ల మీదో రాస్తే పరవాలేదండి. మరి సినిమా పాటల బాణిలకి, భక్తి అంటగడతారు చూడండి, అక్కడే తన్నేస్తుంది. అలా సినిమా ట్యూన్ లకి lyrics రాసి అచ్చయిన పుస్తకాలు కూడా బోలెడన్ని దొరుకుతాయి మార్కెట్లో. 'పగలే వెన్నెల' పాటకి 'షిరిడి శ్రీపతి' అని
పాడితే, ఏదో జమున కళ్ళముందు piano వాయిస్తూ కనిపిస్తుంది కనుక పరవాలేదు.
'అప్పటికింకా నా వయసు నిండా పదహారే ' పాటకు 'ఇప్పటికింకా నీ కరుణ నాపై కురవాలే' అని పాడితే, ఊహించుకోండి. మెదడులో ముమైత్ ఖాన్, పాడేది దేవుడి పాట.
ఇలాంటి పాటలని మించిన శిక్ష లేదు దేవుడికి, భక్తులకి.
No comments:
Post a Comment