పేస్ బుక్
|
పేస్ బుక్ |
'మడిసన్నాక కాసింత కళాపోషణ ఉండాలి' అని రావుగోపాలరావు గారు ముత్యాల ముగ్గు సినిమాలో
చెప్పారు కదా. మన గ్రూప్ పేరు అచ్చంగా తెలుగు కదా. అందుకే, fb తెలుగు లోకి అనువదిస్తే
ఎలా ఉంటుందో చూడండి.
Face book- ముఖ పరిచయం
Wall - గోడ, అంటే గోడ మీద రాతలు రాయడం. ఒక్కరే గోడ మీద ఉంటె విసుగు కదా. అందుకే
మన స్నేహితుల గోడవతల ఏమి జరుగుతోందో చూసి వొస్తున్టాము. వీలుంటే అడపా దడపా వాళ్ళ
గోడల మీద రాతలు రాసేస్తాం. అప్పుడు ,వాళ్ళు కోపంగా మొహం పెట్టుకు జనగణమణ
వాయిన్చేస్తారు. ఒక్కోసారి అలుగుతారు కూడా. మనకి అప్పుడు అభిమానం తన్నుకోచ్చేసి, నాగార్జున
సిమెంట్ తో మన గోడ మనమే కట్టుకుని, దర్జాగా ఎక్కి కూర్చుంటాం.
Info - సమాచారం, ఇక్కడ, మన గురించి మనమెంతైనా పళ్ళాలు కొట్టుకోవచ్చు. అది
చదివేవాళ్ళు అందరిని బోల్తా కొట్టిన్చచ్చు.
Photos - ఇక్కడ మన బారసాల నుంచి ఎన్ని చిత్ర పటాలు ఉంటే, అన్ని పెట్టేసుకోవచ్చు. ఇంకా
అభిరుచి ఉన్న వాళ్ళు, కళ్ళు, మొహం, చెవులు, అన్ని ఫోటో లు తీసుకు పెట్టేసుకోవచ్చు.
చచ్చినట్టు చూడాల్సిందే, గోడ దుకాక.
Notes - మనలో గజినీ లాగ మతిమరపు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇక్కడ వాళ్ళు
చెయ్యాల్సిన పనులు, మర్చిపోకుండా, నిర్మొహమాటం గా రాసేసుకోవచ్చు. రాసేసుకుని మళ్ళి
మర్చిపోవచ్చు.
Friends - స్నేహితులండి, ఎంత మంది పటాలం ఉంటె అంత గొప్ప తెలుసా. స్నేహశీలి అని, సహ్రుదయులని భావన.
Subscriptions - చందా దారులన్నమాట. ఎన్ని చందాలు కడితే అంత గొప్ప.
Groups- గుంపులు, సమూహాలు , పటాలాలు ఎవరి శక్తి ని బట్టి వాళ్ళకి.
Find friends - స్నేహితుల్ని వెతుక్కుని మరి చావ గొట్టడం.
ఇంకా, వార్తలు, వేడుకలు, సంగీతం, గొలుసులు, ఆటలు, పాటలు, సవరణలు, సందేహాలు- సహకారాలు.
తిరిగి, తిరిగి అలసిపోతే, కధ కంచికి, మనం ఇంటికి వెళతాం కదా. అందుకే Home .
అసలు తంపులు పెట్టడం లో ఈ fb అంత శక్తివంతమైనది మరి లేదండి. అడక్కుండానే, మన
సమాచారం ఇంకొకరికి మోసుకు వెడుతుంది.. మనకి వాళ్ళందరి ముచ్చట్లు పట్టుకొస్తుంది. విడాకులు
తీసుకున్న జంటల్లో ఈ మధ్య ఎక్కువ మంది, ఈ నారద fb వల్ల విడిపోతున్నారని దిన పత్రికల
సమాచారం. కాబట్టి శ్రుతి మించిన రాగం సోషల్ networks లో ప్రమాదం. మిత్రులారా, తస్మాత్ జాగ్రత్త.
No comments:
Post a Comment