విన్నపం |
అంటున్నారు అక్కా, చెల్లి. మరే, అక్కా ఆస్ట్రేలియా లో ఉంటుందండి. చెల్లి చెన్నై లో. ప్రాస బాగుంది కదా. ఏవిటో అలా కుదిరిపోయింది.
నీ తెలుగు మా Black బెర్రీ కి అర్ధం కాదు. అన్ని డబ్బాలు డబ్బాలు వొస్తాయి, ఎన్ని డబ్బాలుంటే అన్ని పదాలు అన్న మాట, అంటారు. మరే, నల్ల గేదె(బ్లాకు బర్రె ) లకు తెలుగు నేర్పలేము, అన్నాను నేను. LIC వాళ్ళని చూసినట్టు చూస్తున్నారు మమ్మల్ని, కాస్త నీ రచనా వ్యాసంగం ఆపవే, అన్నారు. ఓపెన్ గ్రూప్ అండీ ఇది, మరి ఇష్టం లేకపోతె వోదిలేయ్యచ్చు కుడా, అన్నాను. 'నా యిచ్చయే గాక నాకేటి వెరపు అన్నాను' కృష్ణ శాస్త్రి గారిలా.
పోనీ, ఏదో ఒక వారపత్రిక లోనో, దిన పత్రిక లోనో, ప్రముఖ రచయిత్రి పద్మిని అని పటం కట్టించి వేయిన్చేస్తాం, అన్నారు. ఇవాల్టి దిన పత్రిక రేపటి చిత్తు కాగితం, కుదరదు అన్నాను. పోనీ, తెలుగు తల్లి fly ఓవర్ పక్కనే నీకు ఒకటి కట్టిన్చేస్తాం, సరేనా? అడిగారు, 'హమ్మా! తెలుగు తల్లి fly ఓవర్ ను లేపేసి, ఎటు దింపాలో తెలియక, చివరికి, 'అటో , ఇటో, ఎటో వైపు అని ఎలాగోలా దింపేశారు,' నాకొద్దమ్మా , అన్నాను.
పోనీ ట్యాంక్ bund మీద నీకో విగ్రహం కట్టించేసి పెట్టిన్చేస్తాం, సర్డుకుపోవే, అన్నారు. మరే, రేపు ఆందోళనకారులు, నా విగ్రహాన్ని పగలకోట్టేస్తే, మళ్ళి పెట్టేది ఎవ్వరు? తెలుగు ఘనులకే దిక్కులేక అలా చేతులు కాళ్ళు, తలలు లేక పడి ఉన్నారు. ససేమిరా అన్నాను.
మరయితే నీకు ఏమి కావాలి? ఎందుకు రాస్తున్నట్టు? అడిగారు.
'దేశ విదేశాల్లో తెలుగు కోసం తపించే నా గ్రూప్ లోని వాళ్ళ కోసం. ఇంకా రోజువారి
పనులతో, అలసిపోయిన నా మిత్రులందరి మొహాల్లో చిన్న చిరునవ్వు చిన్దిన్చడానికే
రాస్తున్నా. ఆ నవ్వులన్ని దోసిట్లో తెచ్చి ఇవ్వండి. రాయడం మానేస్తా! ' అన్నాను
నేను.
No comments:
Post a Comment