Thursday, March 14, 2013

వీరు వారయితే

కవలలయిన వాణి, రాణి అనే, ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. వాణి రేడియో జాకీగా పనిచేస్తుంటే, రాణి t .v ఆంకర్ గా పని చేస్తోంది. 

ఇద్దరూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఒక రోజూ ఇద్దరికీ, 'నేను గొప్ప అంటే, నేను గొప్ప' అనే వివాదం రేగి, పెరిగి 

పెద్దదయ్యి, చిలికి చిలికి, గాలి వాన అయ్యింది. చివరికి ,ఇద్దరూ ఒకే రకంగా ఉంటారు కనుక, ఒక రొజు వాణి పని రాణి, రాణి పని వాణి 

చెయ్యాలని, ఓడిన వాళ్ళు, గెలిచిన వాళ్ళ పనులన్నీ నెల రోజులు చేసి పెట్టాలని, తీర్మానించుకున్నారు.

ఖర్మ కాలి ఆ రొజు ఇద్దరికీ 'లైవ్ షో' లే ఉన్నాయి. ముందుగా వాణి, వెళ్లి t .v కెమెరా ముందు కూర్చుంది. కెమెరా ముందు కూర్చోవడం 

కొత్తయినా, చెల్లెలితో కట్టిన పందాన్ని గుర్తుకు తెచ్చుకుని, బింకంగా కూర్చుంది. ఆంకర్ ల చెవి వెనకాల, వాళ్లకు మాత్రమే వినబడే చిన్న 

మైక్ ఉంటుంది. 'సుత్తి కావాలా...సోది కావాలా..' ప్రోగ్రాం అది. ముందుగా ఒక కాల్ వచ్చింది. 'హలో, ఎవరండి, ఎక్కడి నుంచి

మాట్లాడుతున్నారు?' అడిగింది వాణి, ఆవలిస్తూ. చెవి వెనుక మైక్రోఫోన్ 'రాణి, ఇది లైవ్ , అలా ఆవలించకూడదు, ఒకటవ తప్పు, ' అంది. 

'ఓహో, ఇది కవి( వినిపించడం తో పాటు కనిపించే ) ప్రోగ్రాం కదూ, అని నాలిక కొరుక్కున్న వాణి, సర్దుకుని,' హలో, ఎవరు 

మాట్లాడుతున్నారు?' అని అడిగింది. 'గెస్ హూ ?' అంది అవతలి కంఠం. 'తెలియట్లేదు, ఓడిపోయాను, మీరే చెప్పండి,' అంది వాణి గోముగా, 

బుర్ర గోక్కుంటూ.'రాణి, లైవ్ ఇది, బుర్ర గోక్కోకు, రెండవ తప్పు,' అంది మైక్రోఫోన్ . ఈ సారి కొంత త్వరగానే సర్దుకుంది వాణి. 'మేడం, నా 

పేరు అప్పారావండి, గుర్తు పట్టలా? మీ ఆంకరింగ్ చాలా బాగుంటదండి . మీరు నవ్వితే చాలా అందంగా ఉంటారండి,' అన్నాడు కాలర్. 

'థాంక్స్ ' అంది వాణి భావ రహితంగా. 'రాణి, ఏమయ్యింది నీకు, సిగ్గు పడ్డట్టు, పొంగి పోయినట్టు, భావాలు ప్రకటించు, అప్పుడే ఆ గొర్రె గాడు,

ఫ్లాట్ అయిపోయి, రోజూ ఫోన్ చేస్తాడు, మనమూ కాసిని డబ్బులు సంపాదించుకోవచ్చు, మూడవ తప్పు' అంది మైక్రోఫోన్. కాస్త జీవించేసి, 

'చెప్పండి అప్పారావు గారు, మీరు ఏమి చేస్తుంటారు?' అంది వాణి, హ్యాండ్ బాగ్ లోంచి లిప్స్టిక్ తీసి వేసుకుంటూ. మళ్ళి గగ్గోలు పెట్టింది 

మైక్రోఫోన్... నాలుగోవ తప్పు. 'నేను టైలర్ నండి, బట్టలు కుడతాను,' అన్నాడు అప్పారావ్. 'కుట్టావులేవయ్య పెద్ద, ఇండియా ప్రెసిడెంట్ లా 

ఫొస్, అన్నట్టు ఒక భావం ప్రకటించి, పక్కనున్న మొగ ఆంకర్ కి కన్ను గొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది వాణి. పాపం తన తోటి RJ తో ప్రేమలో

మునిగి ఉన్న వాణి రోజూ, రేడియో లో కనిపించదు గనుక, అలవాట్లో పొరపాటుగా, అలా చేసేసింది. ' రాణి, ఏంటీ ప్రవర్తన? ఐదోవ 

తప్పు...ఇప్పుడొక బ్రేక్ అని చెప్పి నా గదికి రా..' అన్నాడు మైక్రోఫోన్ లో బాస్. గదిలోకి వెళ్ళిన వాణి ని పట్టుకుని, ఐదు తప్పులు, 

బుద్ధుందా..? అంటూ.. చెడ తిట్టేస్తుంటే, వొళ్ళు మండిన వాణి, 'ఇందాకడి నుంచి చూస్తున్నాను... వరదలు వచ్చే ముందు...ఒకటో నెంబర్

ప్రమాద సూచిక...రెండో నెంబర్ ప్రమాద సూచిక లాగ.. ఏంటయ్యా , చెవిలో జోరీగ లా నీ గోల... నేను రాణి ని కాదు వాణి ని... ఏమి 

చేస్కుంటావో, చేసుకో...' అంటూ కోపంగా విసవిసా నడిచి వెళ్ళిపోయింది.

ఆంకరింగ్ 

ఇక రాణి పరిస్తితి ఎలా ఉందో చూద్దామా... అలవాటుగా... కెమెరా ఉందనుకుని, కళ్ళార్పకుండా, చిరునవ్వు నవ్వుతూ... 

సమ్మోహనంగా...చూస్తోంది. 'అమ్మా, వాణి... మొదలుపెట్టు,' అంది మైక్ . అది 'సంధ్యా రోగం' కార్యక్రమం. ఆ రొజు ఆవిడకు

ఇచ్చిన టాపిక్, ' సాయంత్రం మీకు ఏమి చెయ్యాలని అనిపిస్తుంది..?... అని శ్రోతల్ని అడగాలి. మొదటి శ్రోత ' మేడం... నేను జీవా. చాలా 

రోజుల నుంచి ట్రై చేస్తున్న... మీ గొంతు డబ్బాలో గులకరాళ్ళు వేసినట్టు, చాలా బాగుంటుంది, .నేను మీ ఫ్యాన్ ని ..' అంటూ చెప్పుకుంటూ 

పోతుంటే..'సిగ్గు పడుతూ, జుట్టు సవరించుకుంటోంది, రాణి. 'వాణి... ఎక్ష్ప్రెషన్ తక్కువ, వాయిస్ లో ఎమోషన్ ఎక్కువ చెయ్యాలి, 

మాట్లాడు..' అంది మైక్. 'హబ్బ, మీరు భలే గమ్మత్తుగా మాట్లాడతారు... అన్నట్టు, సాయంత్రం మీకు ఏమి చెయ్యాలనిపిస్తుంది...

చెప్పండి... మంచి సమాధానం చెప్పిన వాళ్లకు నా దగ్గర గిఫ్ట్ హంపెర్ లు ఉన్నాయి, చూడండి...' అంటూ చూపించింది, ఉత్సాహంగా. ' 

వాణి... ఇది రేడియో, కనిపించదు, మర్చిపోకు.....' అంది మైక్. ' వాణి మేడం, నాకు సాయంత్రం అయితే, మిర్చి బజ్జి,పానీ పూరి, పిడత 

కింద పప్పు, అన్నీ కలిపి తినెయ్యాలని అనిపిస్తుంది... ఇంకా...' , అంటూ చెప్తుంటే, ఏదో, సరికొత్త ఆవిష్కరణ గురించి వింటున్నంత

ఆసక్తిగా మొహం పెట్టుకు చూస్తోంది, రాణి. 'వాణి ... వాడు పెద్ద తిండిపోతు లా ఉన్నాడు... ఏమయ్యింది నీకు ఇవాళ... గజినీ లాగ ప్రతి 

ఇదు నిముషాలకి గుర్తుచేయ్యలా...కట్ చెయ్యి, మాట్లాడు...' అంది మైక్. ' థాంక్స్ జీవ గారు... వింటూనే ఉండండి... నీరసంగా... 

నిస్సత్తువగా... మా FM ', అంటూ కట్ చేసింది. ఇంకో కాల్, 'చెప్పండి... మీరు సాయంత్రమయితే ఏమి చేస్తారు...' అడిగింది రాణి,

వాలు చూపులు విసురుతూ. 'వాణి... ఇవాళ ఏమి తినలేదా... అంత నీరసంగా మాట్లాడుతున్నావ్? వాయిస్ లో పంచ్ ఉండాలమ్మా...' 

అంది మైక్ . 'మేడం నాకు రేచీకటండి...సాయంత్రం అయితే, ఏమి కనిపించక చాలా గాభరాగా ఉంటుంది... అప్పుడు మీ లాంటి వాళ్ళు 

పక్కనుంటే... ఇంకా ఏమి చెయ్యాలని అనిపిస్తుందంటే...' అంటుండగా కాల్ కట్ చేసిన FM వాళ్ళు, బ్రేక్ చెప్పి, లోపలికి రమ్మన్నారు. బ్రేక్ 

తర్వాత చూడండి,' పిల్లా చావు పాట, ఇంకా పిచ్చి పిచ్చి పాట... చూస్తూనే ఉండండి... ఎక్కడికీ వెళ్ళద్దు...,' అంది రాణి. 'వాణి, ఏంటి, శ్రోత 

అలా అతి చనువు తీసుకుంటుంటే, మాట్లాడవు? చూడండి, చూడండి ఏంటి... మనది రేడియో కనిపించదు... ఇవాళ నీ వల్ల ట్రాఫ్ఫిక్ లో 

FM వింటున్న వాళ్ళంతా మతులు చెడి, వాహనాలు నడి రోడ్డు మీద వదిలేసి పారిపోయారట. దీనికి నీ సంజాయిషీ ఏమిటి?' గద్దించాడు 

బాస్. 'అలాగా... అయితే, వాళ్ళంతా వదిలేసినా వాటిలో, ఖరీదయిన కార్లు కొట్టేద్దాం, మళ్ళి మనమే వాళ్ళకు ఇచ్చేద్దాం... అప్పుడు మన 

ఛానల్ TRP పెరుగుతుందండి...' అంటున్న రాణి ని క్రూరంగా చూస్తూ, ' నీ బుర్ర ,ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి లో పడేసుకోచ్చావని , 

అర్ధమయిపోయింది. ఇంక వెళ్తావా, లేక వాళ్ళకి ఫోన్ చెయ్యమంటావా... ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉంటే, మాకందరికీ పిచ్చి పట్టేటట్టు

ఉంది... గెట్ అవుట్...' అంటూ తరిమేశారు. వేలాడుతూ.. ఇంటికొచ్చిన వాణి, రాణి... 'కుక్క పని గాడిద చేస్తే 'ఏమవుతుందో,

ఇవాళ తెలిసింది. పంతాలకు పోయి, పీకల మీదకు తెచ్చుకున్నాం... రేపు ఇద్దరం, మన బాస్ ల దగ్గరకు వెళ్లి, జరిగింది చెప్పి, కాళ్ళ, వెళ్ళా 

పడి, మన ఉద్యోగాలు తిరిగి తెచ్చుకుందాం...అని నిర్ణయించుకుని, ఒకళ్ళ చెంపలు ఒకళ్ళు వాయించుకున్నారు.

కుక్క పాట్లు

ఎందుకో నాకు కుక్కల మీద, కుక్క మమ్మీల మీద, కుక్క డాడీల మీద, అంత ఇష్టం లేదండి. కుక్కల్ని మనుషులతో సమానంగా 

పలకరించడం, గౌరవించడం నాకు తెలీదండి. కుక్కల్ని ముద్దు చెయ్యడం, మూతి మీద ముద్దులు పెట్టడం, భోజనాల బల్ల మీద

ఎక్కించడం, పక్కలో పడుకోబెట్టుకోవడం, నాకెందుకో అసహజంగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఇంటి సంరక్షణ కోసమో, సరదా కోసమో, లేక 

హోదా కోసమో, కుక్కల్నిపెంచుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. పొద్దుటే, కుక్కల్నేసుకుని వాకింగ్ కు బయల్దేరతారు. అవి , జరగాల్సిన 

పని చూడక, అక్కడా ఇక్కడా వాసన చూస్తూ, యజమానుల్ని పరిగేట్టిస్తాయి. పొద్దుటే, బ్రేక్ ఫాస్ట్ కి ఒక కండ దొరకప్పోతుందా, అని వచ్చే 

పోయే వాళ్ళ వంక చూస్తూ, బెదిరిస్తాయి. 'మొరిగే కుక్క కరవదని', కుక్క బాంధవుల నమ్మకం. కాని, ఆ సంగతి కుక్కకి తెలుసా, దగ్గరికి

వచ్చి గీరడం, నాకడం చేస్తాయి. అది గీరుతుందో, కరుస్తుందో, వాసన చూసి వదిలేస్తుందో తెలియక, బిగుసుకు పోతాను, నేను. తీరా 

కరిచిన్దనుకోండి, 'కుక్క కాటుకు చెప్పు దెబ్బ, అంటూ...' దాని యజమానిని ఏమి చెయ్యలేము కదా. మనం కుక్క చావు చావాల్సిందే, అది 

నా భయం.



బెంగళూరు లో సొంత ఫ్లాట్ కొనుక్కుని, అక్కడికి మారాకా, ఎదురింట్లో పెద్ద నక్కంత కుక్క, 'టఫీ ' దాని పేరట. వాళ్ళు నార్త్ ఇండియాన్స్, 

పండు లాంటి చిన్న బాబు.'అదేంటి, అపార్ట్మెంట్ లలో కుక్కల్ని పెంచడం నిషేధించారు కదా, అంటారా? నిషేదిమ్పులూ మనవే, 

సడలిమ్పులూ మనవే. వెళ్ళిన మొదటి రోజే, బిక్క చచ్చిపోయి, దాన్ని చూస్తుంటే, ఇంటాయన దాని పురాణం చెప్పడం మొదలెట్టాడు. 

'స్నిఫ్ఫెర్' జాతి కుక్కట. ఇరవై వేలు పెట్టి కొన్నాడట, దాని అమ్మ, నాన్న, తాత, అందరూ కుక్క చాంపియన్ లట. దాన్ని కొంచం గీకనిస్తే, 

నాకనిస్తే, ప్రేమిస్తే దానంత మంచి కుక్క లేదట. 'బాబు, కుక్క యజమానికి కుక్క ముద్దు... మా పాట్లు మీకేమి తెలుస్తాయి,'

అనుకున్నాను. తలుపు తీసినప్పుడల్లా, నేను, నా చిన్నకూతురు చేసే హడావిడికి, పెట్టే కేకలకి, ఆ కుక్క బెదిరిపోయి, పారిపోయేది.  

ముందర నెమ్మదిగా, టఫీని మచ్చిక చేసుకుంది, నా పెద్ద కూతురు. దగ్గరికి వెళ్లి నిమిరేది. అది మెల్లగా కూర్చుని, ఆనందించేది. చిన్న 

పిల్లలు, కుక్కలతో ఆడి , ఆ చేతులు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. పైగా, కుక్కల బొచ్చులో ఎన్నో సూక్ష్మజీవులు ఉంటాయి, రోగాలు వచ్చే 

అవకాశాలు ఎక్కువ.

రోజూ వాళ్ళ ఇల్లు చిమ్మితే, దోసెడు కుక్క బొచ్చు రాలి వచ్చేది . ఆవిడ నాకు ప్రేమగా ఏదో పట్టుకోచ్చేది, పైన చూస్తే, కుక్క బొచ్చు, 

మింగలేను, కక్కలేను. వారానికో, పది రోజులకో మాత్రమే దానికి స్నానం. ఒక్కో సారి , భరించలేని, కంపు కొట్టేసేది. మా తలుపు తీస్తే, 

ఇంట్లోకి వచ్చేసేది. నా చిన్న కూతురు స్కూల్ కి వెళ్ళినప్పుడు, దబ్బపండులా ఉండే వాళ్ళ పిల్లాడు,' ఆంటీ, ఇడ్లీ దోస ఖిలాదో, 'అంటూ 

వచ్చేవాడు. నేను తినిపిస్తే, కుదురుగా కూర్చుని తినేవాడు. వాళ్ళ వెనకే, టఫీ వచ్చి కూర్చునేది. ఇంక మా ఇంట్లో అడుగు పెట్టే దమ్ము లేదు 

ఎవరికీ. క్రమంగా, నాకు టఫీ అంటే, భయం పోయింది. నా మాట వినేది, నేను ప్రేమగా నిమిరితే, అందుకోసమే చూస్తున్నట్టు, బుద్ధిగా 

కూర్చునేది. నా చిన్న కూతురు ఉన్నప్పుడు మాత్రం,అది పెట్టే కేకలకు దడిసి, రావడానికి టఫీ భయపడి చచ్చేది. అయితే, నా కూతుర్ని 

ఉడికించడం, దాన్ని చూడగానే, ఆడుకున్దామంటూ, నోట్లో ఒక బంతి పెట్టుకు రావడం చేసేది. అలా మెల్లగా, సమీరకి కూడా టఫీ 

అలవాటయిపోయింది. మొదట్లో టఫీ ని కట్టేస్తేనే కాని, వాళ్ళ ఇంటికి రానని మొరాయించేది, ఇప్పుడు మెల్లిగా దాని మొహంలోకి చూస్తూ, 

అడుగులో అడుగు వేస్తూ వెళ్ళేది, అది కూడా చూసీ చూడనట్టు ఊరుకునేది. అలా మాకు, దానికీ పొత్తు కుదిరింది.

'మీరు దాని అవసరాలు ఎలా కనిపెడతారు?' అడిగానొక సారి. 'అవి చాలా తెలివయిన కుక్కలు, వాటి ఆలోచనల్ని, మన బ్రైన్తో 

అనుసంధానం చేసుకుంటాయి. ఎప్పుడూ తిడతామో, ఎప్పుడూ ముద్దు చేస్తామో, అన్నీ వాటికి తెలుసు, బెట్టు అలకలు, అన్నీ

చేస్తాయి ,' అంది. నేను నమ్మలేదు. కాని అంత త్వరగా వాటి గ్రాహక శక్తికి, నా కాళ్ళ ముందే రుజువు దొరుకుతుందని, నేను అనుకోలేదు. 

ఎదురావిడ మావగారు, అనారోగ్యంతో, పోయారు. వాళ్ళాయన, ముందుగానే ఢిల్లీ వెళ్లారు. తను, పిల్లాడు మాత్రమే ఉన్నారు. 'పద్మిని, 

నాకు కాళ్ళు- చేతులు ఆడట్లేదు. మైల అని తెలుసు, అయినా సాయం చేస్తావా, సర్దుకుంటాను...' అంది ఏడుస్తూ. 'భాభి, మైల -అంటూ 

ఏమి లేవు, మానవత్వాన్ని మించిన నియమం లేదు, పదండి, ' అంటూ వాళ్ళింటికి వెళ్ళాను. తను కుక్కని కేన్నెల్ లో వదిలి వెళ్ళాలి. 

చంటి పిల్లాడిని సముదాయిన్చుకుంటూ, సర్దుకుంటోంది. ఈ లోగా టఫీ ఏడవటం మొదలెట్టింది. 'ఎందుకు ఏడుస్తోంది?' అడిగాను.

'అది, జరిగింది అర్ధం చేసుకునే విజ్ఞత ఉన్న కుక్క. నేను వదిలి వెళతానని, కష్టంలో ఉన్నానని, ఏడుస్తోంది,' అంది. నాకెందుకో, జాలేసింది. 

దగ్గరకి వెళ్లి, 'టఫీ' అన్నాను. ఒక్క ఉదుటన, నా వొళ్ళో తల పెట్టుకుని, బెంగగా చూస్తూ, ఏడ్చింది. నా గుండె కరిగిపోయింది. ఈ సృష్టిలో, 

ప్రేమకి లొంగని ప్రాణి ఉంటుందా చెప్పండి. ఆ మాటకొస్తే, ప్రతి ప్రాణి తపించేది, ఆ గుప్పెడు ప్రేమ, ఆప్యాయత కోసమే కదా. దాని మేధకు, 

ప్రేమకు, నా కుక్క ఫోబియా ఎగిరిపోయింది.

అయినా, ఎంత విశ్వాసం, స్వామి భక్తి ఉన్న జంతువయినా, నేను కుక్కల్ని, చస్తే నమ్మనన్డోయ్ , అన్నీ కుక్కలూ, టఫీ కాదు కదా. మీ 

ఇంట్లో కుక్కుందా... అయితే,దాన్ని కట్టేసే దాకా...నేను మీ ఇంటి దరి దాపులకి కూడా రాను. అందుకోండి నా అభయం.

ప్రేమంటే...



ప్రేమంటే...
అయ్యో, మీకు తెలీదా? శుభోదయాన, సాయంకాలాన చెరువు గట్ల మీద, నిర్జన
ప్రదేశాల్లో, పార్కుల్లోను,సినిమా హల్ల్స్ లోను, బైక్ ల మీద, మీరెప్పుడూ
చూడలేదా? అదంతా, 'బహిరంగ ప్రేమ' అంటారా?అంతరంగంలో ప్రేమ లేకుండా, బహిరంగంగా
కలవడానికి ఎలా వస్తారు, చెప్పండి? అసలు మీరు మా ఇంటి దగ్గరి 'సరూర్నగర్
చెరువు' కట్ట మీద చూడాలండి. సాయంత్రం అయితే, జంటకి-జంటకి మధ్య కేవలం అంగుళం
ఖాళీతో, ప్రేమ ఈనినట్టు, ప్రేమికులు. ప్రేమ గుడ్డిది కదండీ, అందుకే వీళ్ళకి
పక్కనే, మరొక జంట ఉన్నా, ఎంతమంది చూస్తున్న కనిపించదు. వాళ్ళ లోకం వాళ్ళది,
వాళ్ళ ఆనందం వాళ్ళది. అన్నట్టు, చెరువు గట్ల మీద కలుసుకోవడంలో ఇంకొక లాభం
ఉందండోయ్. ప్రేమ విఫలమయితే, అదే గట్టు మీదినుంచి, ఎంచక్కా, చెరువులో
దూకేయ్యచ్చు. లేదా, తమ ప్రేమికుడు లేక ప్రేమికురాలు విసుగు పుట్టిస్తే,
వాళ్ళనే తోసేసి, కొత్త వాళ్ళని వెతుక్కోవచ్చు. ఆ మధ్య ఒక ప్రబుద్ధుడు, ఆడ
గొంతుతో ఫోనులో, ఒక ప్రేమికుడిని మోసం చేసి, డబ్బు బాగా దండుకున్నదటండి, తీరా
చూస్తే , అతను ప్రేమించింది, మరోకతన్ని కాని, ఆమెను కాదని తెలిసిందట.
పరిణితి లేని చిన్న పిల్లలు, ప్రేమ పేరుతొ లేచిపోయి, పక్క దారి పట్టి, ఇంటా
బయటా సమస్యలు సృష్టిస్తున్నారు. అసలామధ్య వచ్చిన '10th క్లాసు', 'ప్రేమిస్తే'
సినిమాలు విద్యార్ధుల మీద ఎంత దుష్ప్రభావాన్ని చూపించాయో చెప్పలేము. పదో
తరగతికి రాగానే, ప్రేమించడం తప్పనిసరి, అన్న భావన కలుగజేసాయి. సినిమాలు సమాజం
మీద అంతులేని ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది వాస్తవం. ఆ సమయంలో, ఆ సినిమాలు,
'వాస్తవ సంఘటనలు' అన్న పేరుతొ, ఎన్ని బ్రతుకులు చిద్రం చేసాయో తెలుసాండి? మా
ఊరిలోనే, తెలిసిన వాళ్ళ పదో తరగతి చదివే పిల్ల, సైకిల్ షాప్ వాడితో, జండా
ఎత్తేసింది. చెప్పుకోడానికి చాలా తేలికే, కాని ఆ తల్లిదండ్రుల మనో వేదన,
అవమానం, బాధ, పిల్ల ఎలా ఉందో, ఎక్కడుందో అన్న బెంగ, ఊహించగలరా? చివరికి ఆ
పిల్ల ఆచూకి తెలుసుకుని, వాళ్ళిద్దర్నీ ఒప్పించి, ఊరికి తీసుకొచ్చి పెళ్లి
చేసారు. పరువు ప్రతిష్టలు నిలబెట్టుకున్నా, ఒక రకంగా పెరిగిన పిల్ల, మళ్ళి
ఉపాధి కల్పించడం, చదివించడం, ఆసరా ఇవ్వడం, ఎంత కష్టం? విలువయిన సమయాన్ని,
భవిష్యత్తును, నాశనం చేసుకున్నకా, బాధపడితే ఏమి ప్రయోజనం? సినిమాల్లో చూపించే
ప్రేమ రంగుల హరివిల్లు, మనకు బాగుండేలా తీస్తారు. కాని వాస్తవం ఎంతో కటినంగా
ఉంటుంది. ఈ విషయంలో, తాళ్ సినిమాలో చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంది,' హమ్ దర్ద్
బేచ్తే హై, ఖరీద్తే నహిన్..', అంటే వీళ్ళంతా మన భావోద్వేగాలను నమ్ముకుని,
అమ్ముకుని సోమ్ముచేసుకుంటారు, తన దాకా వస్తే, తప్పుకుంటారు. పై రెండు సినిమా
డైరెక్టర్ లలో ఎవరికయినా, వాళ్ళ పిల్లలు చిన్న వయసులో బ్రతుకు
నాశనం చేసుకుంటామంటే, ఒప్పుకునే సత్తా ఉంటుందా, చెప్పండి.
ఆడపిల్లలు పెద్దవుతుంటేనే, భయపడి చావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అమాయకులయిన ఆ
లేత మొగ్గల్ని, నువ్వు లేనిదే బ్రతకలేనని,ఆత్మహత్య చేసుకుంటానని , నీ వల్ల నా
ఏకాగ్రత తగ్గిందని, విషాదంగా మొహం పెట్టుకుని, చేతులు కోసుకుని, రక్తంతో
ఉత్తరాలు రాశి, నిందించి, దిగజార్చి, వేధించి, భయపెట్టి, మానసిక దోపిడీకి,
వేదనకు గురి చేస్తారు. నిలువునా వంచించి, ఆసిడ్ దాడికి, చివరికి చంపడానికి,
తల్లిదండ్రులని నరకడానికి కూడా వేనుకాడట్లేదు. ఇది ప్రేమ కాదు, ప్రేమోన్మాదం,
మానసిక రుగ్మత.
బలిదానం కోరేది ప్రేమ కాదు, అవసరమయితే, తన ప్రాణాలు ఇచ్చయినా, ఎదుటివారిని
ఉన్నత స్థానంలో నిలబెట్టేదే ప్రేమ. భర్త లివేర్ పాడయితే, తన లివేర్ మార్పిడికి
ఇచ్చి, ప్రాణం పోసింది నాకు తెలిసినావిడ. ఆవిడది నిజమయిన ప్రేమ. ప్రేమించిన
వాళ్ళ ప్రపంచాన్నంతా ప్రేమించడం, వాళ్ళ సుఖసంతోషాలను కోరుకుంటూ, వాళ్ళ
ఉన్నతికి ప్రోత్సహించడం, అవసరంలో ఆసరాగా నిలవడం ప్రేమ. పెదవి విప్పకుండానే,
ఎదుటి వారి భావాలను, అవసరాన్ని, అర్ధం చేసుకుని, సహకరించడం ప్రేమ. దూరంగా
ఉన్నా విడవని మధుర జ్ఞాపకాలు, దూరమయినా వాళ్ళ మంచినే కోరే సహృదయం, ఉంటాయి. నిజమయిన
ప్రేమలో దైవత్వం ఉంటుంది, మాటలకు, భాషకు అందని ఆర్ద్రత, త్యాగం, స్వచ్చమయిన
మమత ఉంటాయి.

పార్టీ టైం




గొప్ప వారింట్లో పిల్లి పుట్టినరోజు కుడా, వేడుకే కదండీ. అందుకే, ఒక
ప్రముఖుడు, వారింట్లోని పెంపుడు పిల్లి పుట్టినరోజుకు, అందరినీ ఆహ్వానించాడు.
మరి పార్టీ నేపధ్యం(థీమ్) 'ఆది మానవుడి' పార్టీ విధానం. ఇదేదో చాలా కొత్తగా
ఉందే, అనుకున్న ఆహ్వానితులంతా, చాలా ఉత్సాహ పడ్డారు. అందులో, మరీ కాస్త,
కడుపుబ్బరం ఎక్కువ ఉన్న పెద్దాయన, పార్టీకి పిలవగానే, 'బాబు, మనిషి,
ఆదిమానవుడి నుంచి పరిణామం చెంది వచ్చడు కదా, ఇప్పుడు వెనక్కి వెళ్ళడం,
...ఏంటో...పురోగమనం నుంచి తిరోగమనం అవుతుందేమో'...అన్నాడు సందేహంగా. 'It's all
fun, Uncle', అన్నట్టు, డ్రెస్ కోడ్, గ్రీన్ డ్రెస్ కి ఆకులు కట్టుకు రావాలి.
ఆడవాళ్ళు, మేడలో, చెవులకి, ఈకలు, కోయ పూసలు వేసుకోవాలి. పిల్లలు, వొంటికి నల్ల
రంగు వేసుకుని, పులి చర్మం డ్రెస్, ఆకుల కిరీటాలు పెట్టుకోవాలి. హబ్బ,
తలచుకుంటేనే, ఎంతో ఉత్సాహంగా ఉంది, తప్పక రండి', అని ఫోన్ పెట్టేసాడు.
ఇంక జనాలు బట్టల షో రూం ల మీద పడ్డారు. ఎవరికి వారే page3 లో ప్రత్యేకంగా
కనిపించాలని, 'ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి' లాగ హైరానా పడిపోయారు.
మొత్తానికి ఎలాగో, బట్టలు, పూసలు అయ్యాకా, పావురాల ఈకలు, నల్ల రంగు డబ్బాలు
తెచ్చుకుని, క్రోటన్ మొక్కల రంగు రంగు ఆకులు దండలు కట్టుకుని, పులి చర్మాలు
అద్దెకు తెచ్చుకుని, తయారయ్యారు. పార్టీ రొజు సాయంత్రం, వాళ్ళ ఇంటికి
వెళ్లేసరికి, పెద్ద పెద్ద గుహలు, చెట్ల కట్ అవుట్ లు ,అలంకరించి, వాళ్ళ
ఇంటినే, అడవి చేసి వదిలిపెట్టారు. మైక్ లో జోరుగా అడవి పాటలు
వినిపిస్తున్నాయి...'జుమ్బాక జుమ్బాక హో హో...'అంటూ విచిత్ర మయిన శబ్దాలు.
పెద్ద పెద్ద అడవి బొమ్మల తెరలు, విచిత్ర అలంకారాలు, వాళ్ళ పిల్లికి కూడా ఆకులు
కట్టి, అందరికీ కనిపించేలా, చెట్టు కొమ్మకు, బుట్ట కట్టి, అందులో
కూర్చోపెట్టారు. అందరూ, పిల్లి దగ్గరకు వెళ్లి, 'వావ్, ...సో క్యూట్....' అంటూ
దాన్ని ముద్దు చేసేసారు. వాళ్ళ అవతారాలు చూసి, పిల్లి హడిలిపోయి,
బిక్కచచ్చిపోతోంది. ఈ లోపల ఆకులు కట్టుకుని, ఈకలు పెట్టుకున్న విదేశి భామలు,
బొచ్చేల్లో, జుంటి తేనె తీసుకు వచ్చారు. ఎవరికి వారే,' హమ్మో, బొచ్చేల్లో ఇంత
తేనె తాగితే, బాల్చి తన్నడం ఖాయం,' అనుకున్నారు. ఇంకో భామ ఆకుల్లో పచ్చి మాంసం
ముక్కలు తెచ్చింది. వచ్చిన వాళ్ళకి కడుపులో తిప్పింది. మరో యువకుడు, ఆకులు,
అలములు, కందమూలాలు, ఫలాలు పట్టుకొచ్చాడు. జనాలు, ఇదొక్కటే తినేట్టు ఉందని, వరద
బాదితుల్లా ఎగబడ్డారు. అందరికీ, దోన్నేల్లో, మంచి నీళ్ళు పెట్టారు. కాసేపటికి,
అందరికీ, బల్లాలు ఇచ్చి, అడవి నృత్యం చెయ్యమన్నారు. ఒక లయ, పధ్ధతి లేకుండా,
కూతలు కూస్తూ, అడ్డదిడ్డంగా, నృత్యం చేసారు. తర్వాత, 'విల్లంబుల' గేమ్.
ఎదురుగా, గోడ మీద ఉన్న వస్తువుని, గురి చూసీ కొడితే, బహుమతి, అన్నారు. ఈ
సందడిలో, కేకు వచ్చింది. పెద్ద కండ దుమ్పకి, రక రకాల రంగుల పచ్చి కూర ముక్కలు
అంటించి తెచ్చారు. అది తింటే, నాలిక, గొంతు, దురదే అని తెలిసిన వాళ్ళంతా,
దిగాలు పడిపోయి, అది కనిపించనీయకుండా, 'ప్లాస్టిక్ నవ్వులతో', వింత పదాల
హ్యాపీ బర్త్డే పాట పాడారు. విందులో కంద కేకు, మేక పాలు, కాల్చిన పచ్చి మాంసం,
ఉడకబెట్టిన వేరుసేనగలు, కాల్చిన చిలగడదుంపలు, గంజి, విప్ప సార, అందించారు.
'ఫీల్ అట్ హోం, హౌ ఇస్ ద డిన్నర్?' అంటుంటే, అంత ఖర్చు పెట్టి ఇంత చెట్టా
పార్టీ కి వచ్చినందుకు, మింగలేక, కక్కలేక, ఉన్న జనాలు, 'ఇంకా నయం, మా ముత్తాతల
తాతలు కోతులు...' అంటూ కోతుల పార్టీ పెట్టాడు కాదు, ఎలుగుబంటి మోహము
వాడూను...అనుకుంటూ....'గ్రేట్ ఐడియా,...హవింగ్ ఫున్....మేమోరబల్ ...'
అంటున్నారు. చివరగా, ఆహుతులందరికీ, బహుమతులు ఇచ్చారు. అందరూ పిల్లిని దీవించి,
ఇళ్ళకు వెళ్లారు. కనీసం బహుమతి అయినా దక్కిందని, చూసిన వాళ్ళకి, అందులో ఏమి
కనిపించిన్దనుకున్నారు? కొమ్ము బూర, మూలికలు...
మరి ఎవరన్నా నా పార్టీ నేపధ్యాన్ని కాపీ కొట్టేస్తే ఊరుకోనన్డోయ్ ....

ది ఆడ్ అవార్డ్స్

'వెండి తెర అవార్డ్స్' ఉన్నాయి. 'బుల్లి తెర' అవార్డ్స్ ఉన్నాయి. అందుకే, ఒక
మేధావికి, ఎలాగూ చాలా మంది క్రికెటర్స్, సినిమా నటీనటులు ఆడ్స్ లో నటిస్తారు
కనుక, 'ఆడ్ అవార్డ్స్' పెట్టాలన్న ఆలోచన వచ్చింది. అయితే, చాలా ఏళ్ళ నుంచి,
చాలా మంది తారలు ఆడ్స్ లో నటించడం వల్ల , ఎవరు ఎన్ని ఆడ్స్ లో నటించారో,
లెక్కపెట్టడం కష్టం అయ్యింది. అందుకే, ఎవరు నటించిన ఆడ్స్ తాలూకు వస్తువులు,
వారే తెచ్చుకుని, మళ్ళి స్టేజి మీద నటించి, చూపమన్నారు. అప్పుడు ఎవరికి అధిక
నటనా ప్రావీణ్యం, మార్కెటింగ్ స్కిల్ల్స్ ఉన్నాయో, జడ్జీ లు నిర్ణయించి,
అవార్డ్స్ ఇస్తారని చెప్పారు. అందరు తారలు విచ్చేశారు.
ముందుగా, బాలీవుడ్ తారలు వస్తున్నారు. బిగ్ బి 'కాడ్బురి
సెలెబ్రషన్ ' చాక్లేట్ పుచ్చుకుని, 'కుచ్ మిటా హో జాయ్...', అంటూ వచ్చి,
చేతిలోని ఎల్లో పేజెస్ బుక్ చూపించి, 'జస్ట్ డయాల్', అన్నారు . రిలయన్స్ ఫోన్
జేబులోంచి, తీసి చూపించారు . పులి లా గాండ్రించి, 'గుజరాత్ టూరిసం' , అది
చుడప్పోతే, మీరేది చూడలేదు..., అన్నారు . icici జీవిత భీమ పాలసీ చూపించి ,
మెడ కోసి పడిపోయినట్టు, నటించి, హ హ అని నవ్వరు. తనిష్క్ నగలు, అంటూ మెళ్ళోని
గొలుసు చూపించారు. డాబర్ హనీ అంటూ, ఒక చెంచా తో తేనె తాగారు. చివరగా
,జేబులోంచి, పోలియో చుక్కలు రెండు నోట్లో వేసుకుని, 'దో బూంద్ జిందగీ కే'..
అంటూ వెళ్ళిపోయారు.



షారుఖ్ 'ఫెయిర్ అండ్ హ్యాండ్ సం ' క్రీం తీసి, మొహానికి రాసుకున్నారు.
,'హుండై' కార్ బొమ్మ తీసి, జుయ్ జుయ్ ... అంటూ శబ్దాలు చేసారు. బొమ్మ టీవీ
తీసి , 'డిష్ కరో, విష్ కరో' అన్నారు. చివరగా , పెప్సోడేంట్ పేస్టుతో పళ్ళు
తోముకుని, లక్ష్ సబ్బు చేతికి రుద్దుకుని, వెళ్ళిపోయారు .
సల్మాన్ ఖాన్ 'ఆక్టివ్ వీల్ ' సుగంధం ఒలికిస్తూ... అంటూ వచ్చి కాసేపు అటూ ఇటూ
పరిగెత్తారు. చొక్కా విప్పి, డిక్సి బనీను చూపించారు. మౌంటైన్ డ్యు తాగి, 'డూ
ద డ్యు ' అన్నారు. చివరగా , క్లోర్ మింట్ బిళ్ళ నోట్లో వేసుకుని, బనీను
విప్పేసి గాల్లో ఊపి, వెళ్ళిపోయారు.
అమీర్,' ఇండియన్ టూరిసం ' అతిధుల్ని గౌరవిద్దాం అంటూ వచ్చి, టీవీ బొమ్మ చూపి,
'టాటా స్కయ్' దీన్ని పెట్టుకుంటే లైఫ్ జిన్గాలాల...అన్నారు. కోక్ తీసి
తాగారు. టైటాన్ వాచీ చూపారు , సాంసంగ్ గురు మొబైల్ లో మాట్లాడుతున్నట్టు,
నటించారు. చివరికి, 'సత్యమేవ జయతే...' అని నినాదాలు చేస్తూ వెళిపోయారు.
సైఫ్ అలీ ఖాన్ 'లేయస్' ప్యాకెట్ బాగా తినేసి, టీ తాగి, 'వః తాజ్' అంటూ
వెళిపోయారు. అభిషేక్,' వాట్ ఆన్ ఐడియా సర్ జీ...' అంటూ చెట్టు వేషం
వేసుకొచ్చి, నవ్వి వెళ్ళిపోయారు. రన్బీర్ కపూర్, డోకమో, విర్జిన్ మొబైల్,
చూపించి, పెప్సి తాగి వెళ్ళిపోయారు.
కత్రిన కైఫ్ మామిడిపళ్ళ రసం తాగి, గీతాంజలి జేమ్స్ అంటూ నగలు ,వగలు చూపి,
వీట్, మృదువయిన చర్మానికి, అంటూ నటించి చూపి వెళ్ళిపోయింది. తరువాత మరికొంత
మంది భామలు ఊకుమ్మడిగా, రక రకాల సబ్బులు రుద్దుకు చూపారు. నగల తళుకులు, వంటి
మెరుగులు చూపారు. అప్పుడే మధ్యలో డాన్సు లు చెయ్యాల్సి వచ్చినప్పుడు, 'వాషింగ్
పౌడర్ నిర్మా...' , 'వికో వజ్రదంతి' ,' వుడ్ వర్డ్స్ గ్ర్యప్ వాటర్' ల ఆడ్స్
కు చక్కగా అభినయించారు. ఇక తెలుగు హీరో ల వంతు వచ్చింది.
జూనియర్ NTR నవరత్న ఆయిల్ తీసి, తలకు రాసుకున్నారు. నమ్మకమయిన బంగారం ,
'మనప్పురం గోల్డ్ ' అంటూ చేతికున్న బ్రేసులేట్ ,మెళ్ళో సైకిల్ చైన్ అంత
గొలుసు చూపారు. 'జై తెలుగు దేశం' అంటూ సైకిల్ బొమ్మ చూపి గట్టిగా అరిచారు.
చివరగా, 'జండు బాం' తలకు రాసుకుని, 'జండూ బామ్ జండూ బామ్ నొప్పి హరించే
బామ్..' అంటూ పాడి 'అరె పోయిందే...' అంటూ వెళిపోయారు.
మహేష్ బాబు 'థమ్స్ అప్' దమ్ముందా....అంటూ వచ్చి, 'భలే ఐడియా ' అంటూ ఐడియా ఫోన్
చూపించి , జోయ్ అలుక్కాస్ వజ్రపు ఉంగరం చూపి... , ఐశ్వర్య ను చూపి, 'కాలేజా
మీరా, అంత లావైపోతేనూ...సంతూర్ మమ్మీ' అని, చివరగా ,ఐషు అలా పెరిగిపోయిందన్న
విచారంలో, అమృతాంజన్ బామ్ రాసుకుని, వెళిపోయారు.
అల్లు అర్జున్ 7 అప్ తాగి, 'కాల్గేట్ జెల్' తో పళ్ళు తోముకుని, వెళ్ళిపోయారు.
రాం చరణ్ ఎయిర్ టెల్... ఎప్పుడైనా... ఎక్కడైనా... అంటూ, డోకమో మొబైల్ చూపి,
పెప్సి తాగి వెళ్ళిపోయారు. ఇంతలో ధోని వచ్చి, తాను ఆ ఆడ్ లో చేసానని, రాం చరణ్
తో డాన్సు వేసాడు. సచిన్ వచ్చి, బూస్ట్ తాగి,' బూస్ట్ ఇస్ ద సేక్రేట్ అఫ్ మై
ఎనేర్జి ...' అన్నాడు, పక్కనుంచి అందరూ, 'అవర్ ఎనేర్జి' అన్నారు. ద్రావిడ్ హచ్
కుక్క తెచ్చి, 'నేనెక్కడికి పోయినా ఈ కుక్క దాపురిస్తుంది...' వేర్ ఎవెర్ ఐ
గో... అంటూ కుక్క వెనకే వెళ్ళిపోయాడు. గంగూలీ హీరో హోండా బైక్ వేసుకొచ్చాడు.
పోటీగా, ప్రియాంక,' వై శుడ్ బోయ్స్ హావ్ అల్ ద ఫన్...?' అంటూ హీరో హోండా
ప్లయసుర్ బండి తేచ్చింది.
అందరూ ఎవరికి అవార్డు వస్తుందా అంటూ, ఎదురు చూస్తుండగా...'అండ్ ద అవార్డు గోస్
టు....అక్షయ్ కుమార్...' అన్నారు. అన్యాయం, అతను ఇక్కడికి రాలేదు,
అంటూ గగ్గోలు పెట్టారు . 'మేము చెయ్యనిది ఏమిటి, ఆయన చేసింది ఏమిటి?' అంటూ
గొడవ పెట్టుకున్నారు. మీరే చూడండి, అంటూ ప్రొజెక్టర్ ఆన్ చేసారు న్యాయ
నిర్ణేతలు.
' డాలర్ క్లబ్... బటన్ ఖుల్ల హాయ్ ఆప్క...' అన్న 'లో దుస్తుల' ఆడ్ అది. ఇంకేమి
చేస్తారు...అంతా నిశ్సబ్దంగా ఆమోదించారు.