Wednesday, March 13, 2013

పదవీ గీత -- నేతల రాత

పదవీ గీత -- నేతల రాత 
-------------------------------

'నాయకా! పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది. అశాశ్వతమయిన ఈ పదవిని గురించి వ్యామోహము వీడి, శాశ్వతమయిన డబ్బును అక్రమ మార్గములో ఆర్జించుము.'

'నాయకా! ధనమూలమిదం జగత్ ' అన్నారు. పైసా మే పరమాత్మా హై...అందుకే జీవిత పరమార్ధం డబ్బే. ఈ డబ్బును పదవుల కోసం ఖర్చు పెట్టక, పదవి ఉన్నవారి పక్కన చేరి, డబ్బా కొట్టి, డబ్బు సంపాదించుము.'

'నాయకా! రుణానుబంధ రూపేణ....అన్నారు. అనగా నీ పశువులకు, పత్నికి, సుతులకు, ఆప్తులకు వీలయినన్ని ఆస్తులు రాసి, వారి ఋణము తీర్చుకోనుము.'

'నాయకా! వాములు మింగే సాములోరికి గడ్డిపరక నైవేద్యం....అన్నట్టు, నీకు అడ్డమోచ్చే అందరికీ తలో గడ్డి పరకా దానం చేసి, వెనకేసేయ్. నీలాంటి అనేక గడ్డిపరకలు కలిస్తే, రేపు వారు కూడా వాముల సాములోరు అవుతారు.'

'నాయకా! ఆరొగ్యమె౪ మహాభాగ్యము. మన అనారోగ్యము వైద్యులకు మహాభాగ్యము. అందుకే, డబ్బును దాచుటకు, పదవులు పొందుటకు పాకులాది, ఆరోగ్యము చెదగోట్టుకోకుము. లౌక్యంగా మార్గం కనిపెడితే....డబ్బు చెట్లకు కాస్తుంది.'

'నాయకా! చివరగా...పాపి చిరాయువు, అన్నారు. అంటే, నీవు ఎన్ని పాపములు చేసిన అంతగా ఆయుష్షు పెరుగును. అందుకే, లెక్కలేనన్ని పాపములను చేయుము. తరువాత ప్రాయశ్చితం చేసుకొనవచ్చును. దీర్ఘాయుష్మాన్ భవ !'


No comments:

Post a Comment