ఏదో వంద కట్లు కట్టిన చంటి పిల్ల ఫోటో వస్తుంది...' ఇది లైక్ చెయ్యకపోతే మీకు హృదయం లేనట్లే...ఇది షేర్ చెయ్యకపోతే మీరు మనిషి కానట్టే లెక్క...'
'ఇది వెంటనే షేర్ చెయ్యండి...అదృష్టం తన్నుకురాకపోతే చెప్పిచ్చుక్కోట్టండి'...అంతా బానే ఉంది కాని, ఎవర్ని కొట్టాలో తెలీదు.
ఇంకొక చిత్రం...ఒక దీనమయిన బీద పిల్లవాడిది...అన్నం కోసం తపిస్తున్నాడు...వాడికి కావలసింది అన్నం...ఫోటో తీసి పేస్ బుక్ లో పెట్టే చవటాయి ...దానికి బదులు అతనికి ఆ పూట సుష్టుగా భోజనం పెట్టిస్తే బాగుండేది. అంతేగాని అతను లైక్ లు తినడు కదా...
ఈ సానుభూతి లైక్ లు, కామెంట్ లు చూస్తే నవ్వు వస్తుంది. చిన్నప్పుడు ఇళ్ళకి పేరు లేని దేవుడి ఉత్తరాలు వచ్చేవి. 'తక్షణం వెయ్యి కాపీ లు రాసి పోస్ట్ చెయ్యకపోతే, మీకు తీరని నష్టం జరుగుతుంది...' అన్న సందేశంతో...మొదట్లో జనాలు పాప భీతితో వెయ్యి కాపీలు రాసేవారు. తరువాత చేతులు నొప్పెట్టి ఊరుకునేవాళ్ళు.
ఇటువంటి వాటికి కావలసింది మిధ్యా సానుభూతి, ప్రచారం. కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలియకుండా ఉంటే, అదే నిజమయిన దానం. దానం చెయ్యి, కాని చెప్పుకోకు. అడిగిన ప్రతీ వారికీ కాదనకుండా, కనీసం ఒక్క రూపాయన్నా దానం చెయ్యాలి. నిజానికి, దానం ఇచ్చేవాడు , తీసుకునే వాడికి రుణపడి ఉండాలని, మా గురుదేవులు చెప్పారు. వారు ఆ రూపంలో మన కర్మలనూ, రుణాలనూ స్వీకరిస్తున్నారు. అందుకే, అహంతో కాకుండా ఉదార స్వభావంతో దానం ఇవ్వండి. మన చెయ్యి పైనుండే అవకాశం ఇచ్చినందుకు సర్వదా ఆ భగవంతుడికి కృతఙ్ఞతలు తెలుపండి.
"ఇంకొక చిత్రం...ఒక దీనమయిన బీద పిల్లవాడిది...అన్నం కోసం తపిస్తున్నాడు...వాడికి కావలసింది అన్నం...ఫోటో తీసి పేస్ బుక్ లో పెట్టే చవటాయి ...దానికి బదులు అతనికి ఆ పూట సుష్టుగా భోజనం పెట్టిస్తే బాగుండేది. అంతేగాని అతను లైక్ లు తినడు కదా..."
ReplyDeletemanushullo koddiga migilina maanavatvaanni champedaaka ee spammers agaranipistundi.
chala chakkaga raasaru :-)