డార్లింగ్ సునీత,
మొదటిసారి నేను కొరియర్ ఇచ్చేందుకు మధ్యానం 12 గం ||లకు మీ ఇంటికి వచ్చినప్పుడు, నోట్లో బ్రష్ పెట్టుకుని, మూతి నిండా నురగతో నువ్వు వచ్చినప్పుడు, నల్లటి బట్ట మీద తెల్లటి రిన్ సబ్బు నురగలా,మిలమిలా మెరిసిపోతున్న నిన్ను చూసి...నా గుండె జారి గల్లంతయ్యిందే....
రెండవసారి నేను మిట్టమధ్యానం మళ్ళి కొరియర్ ఇద్దామని వచ్చేసరికి, నువ్వు, మీ అమ్మ, మెట్ల మీద, జుట్లు విరబోసుకుని, విఠాలాచార్య సినిమాలో ఆడ దయ్యాల లాగా...పేలు కుక్కుకుంటుంటే...ఆహా, ఆ సీన్ మనసులో ముద్రించుకు పోయి, మై హార్ట్ ఇస్ బీటింగ్ అదోలా...అని పాడుకున్నా!
మూడోవ సారి నేను తలుపు కొట్టగానే, డబ్బాడు కుర్కురే నోట్లో కుక్కుకుని, గరగారలాడిస్తూ రాళ్ళు రాసుకున్న రావంతో, 'ఏం కావాలి?' అని జమాయించి నువ్వు అడిగినప్పుడు, ' నువ్వే కావాలి...' అనబోయి, మాటరాక, చూస్తుంటే, నీ గజ పాదంతో, నా కాలు తొక్కినప్పుడు( అది ఫాక్చేర్ అయ్యిన్దనుకో ) , అరికాలి మంట నెత్తికెక్కి నేను గెంతుతుంటే, నువ్వు గమ్మత్తుగా వికటాట్టహాసం చెయ్యడం చూసి...నాకు ఏదో ఏదో అయిపొయింది.
చూడు సునీ, ఒక్క చేత్తో కొరియర్ , పుస్తకాలు, క్షిరాక్ష్ షాప్ అన్ని నడపలేక పోతున్నా...దాదా ల బెదిరింపులు ఎక్కువగా ఉన్నాయి. నువ్వు నన్ను పెళ్లి చేసుకుని, నాకు చేయ్యందిస్తే, నీ వొంటి చేత్తో మనం కొండల నయినా పిండి చెయ్యచ్చు. అంతే కాదు...అనకొండ లాంటి నిన్ను ,నేను తప్ప మరెవ్వరూ కన్నెత్తి చూసే సాహసం చెయ్యరని, నా ప్రగాడ విశ్వాసం...అందుకే అట్టే, బెట్టు చెయ్యక...ప్రేమించుకుందాం రా...
ఇట్లు
భవదీయ విధేయుడు
కొరియర్ కనకారావు.
No comments:
Post a Comment