ఆత్మవిశ్వాసం...సెల్ఫ్ కాన్ఫిడెన్సు ...బాగా ఉండాలి, ఉండాలి అని స్కూల్ నుంచి పోరుతుంటే, నేటి యువతకు ఆ ఆత్మవిశ్వాసం కాస్తా అదికమయిపోయి, అతి విశ్వాసంగా పరిణమిస్తోందేమో అన్న సందేహం వస్తోంది. నేటి యువకుల్లో చాలా మందికి తాము చేసేవన్నీ చాలా గొప్పవని, ఎవరినీ లెక్క చెయ్యకపోవడం, తలతిక్కగా వ్యవహరించడం తమకే చేల్లిందన్న భావనలు కనిపిస్తున్నాయి. ఇటువంటి ఒక యువకుడు ప్రేమ లేఖ రాస్తే ఎలా ఉంటుందో చూడండి.
బేబ్,
చూడు, కాలేజీ లో మన పేరు చెప్తే అమ్మాయిలు కెవ్వు కేక. మనం బైక్ మీద తోక్కామంటే రెండువందలకి స్పీడు తగ్గదు. మా బాబుకి కోట్ల ఆస్తి ఉంది. ఇంట్లో మన పేరు చెప్తే హడల్. మనదొక పెద్ద కేర్ లెస్ టైపు.
మొన్నరెడ్ డ్రెస్ లో నిన్ను చూసి నేను సూపర్ లైక్ .నా ఫ్రెండ్ గాళ్ళు నన్ను చూసి lol. నన్ను ప్రేమించుకునే ఒక ఛాన్స్ నీకు పడేయ్యాలని అప్పుడే ఫిక్స్ అయ్యా. చిల్ బేబ్ ...టేక్ ఇట్ ఈజీ. నువ్వు కాదంటే ఏమీ ప్రాబ్లం లేదు. ఇదే లెటర్ షీలా కి , ఖుషి కి, డాలీ కి పంపా. ఎవత్తో ఒకత్తి పడకపోదు. సిటీ ల బైక్ మీద చక్కర్ కొట్టి , ఇమక్ష్ లో మూవీ, చట్నీస్ లో లంచ్, నైట్ డిస్కో లో మస్తి. ఎంజాయ్ ...ఇది మన మ్యాప్. రచ్చ చెయ్యకుండా, జల్ది రిప్లై ఇవ్వు.
బై బేబ్ ...లైట్ తీస్కో.
ఇక ఉత్తరం అందుకున్న బేబ్ మంచి ఫ్యాక్షన్ వాతావరణం నుంచీ వస్తే... సమాధానం ఇలా ఉంటుంది.
ఏంది బే ,
దిమాక్ ఖరాబైందా . మా నాయన ఎవరో ఎర్కనా ? సీమ సింహం.
మా నాన్న అరిస్తే నాల్కె కోస్తడు. చెయ్యెత్తితే చెయ్యి తీస్తడు. కాలెత్తితే కాలు గోస్తడు. తిరగబడితే శాల్తీలు మిగలవ్ . ఇక నీ లెటర్ మా నాయన చేతికిస్తే ఏమైతదో చూడు మల్ల . నీ బొక్కలు తీస్తడు బిడ్డా. నీ ఇంట్లో బాంబు పెడ్తడు . నీ బైక్ నమిలి మింగుతడు . నీకు గుండు గీయించి, నీతో మందుగుండు కూరిస్తడు . ఏదో బడాయి పోరడని ,ఈ పాలి మాఫ్ జేస్తున్న .నా దిక్కు మల్ల జూసినావంటే దిక్కులేని వాడివైతావ్ బిడ్డ. ఖబర్దార్.
ఆ యువకుడి రిప్లై...
నీ కాల్మొక్త బాంచన్ నన్నొదిలెయ్ తల్లో ...బతికుంటే బైక్ మీద బటానీలు అమ్ముకుంటా...
No comments:
Post a Comment