Thursday, May 3, 2012

దృష్టిలో పడడం


దృష్టిలో   పడడం 




“ఘటం చిద్యాత్

పటం బిద్యాత్


ఏనకే ప్రకారేణ


ప్రసిధ్ధః పురుషా భవేత్!”


అంటే నడి వీధిలో కుండ బద్దలుకోట్టయినా, పటం పగలగోట్టయినా, ఎలాగో ఒకలాగా జనాల 
దృష్టిలో పడి, 


గుర్తింపు పొందమన్నారు.

ఆ మధ్య కార్ లో ఎఫ్ ఎం radio వింటుంటే, ఒకరు లేడీ RJ దృష్టిలో పడాలని,' ఓయ్ 
జో, ఎవరో గురతుపట్టావా? 


చెప్పుకో చూద్దాం.' అంటూ ఆవిడ మేధాశక్తికి సవాల్ విసిరాడు. పాపం ఆవిడ ' వేణు, అప్పారావు, సురేష్, 


మాధవ్, యాదవ్ ' అంటూ రకరకాల పేర్లు చెప్పింది. చివరికి ఓడిపోయానని ఒప్పెసుకున్నకా , 'It's me yaar,

రాంబాబు' అన్నాడు. వెంటనే, అష్టాచెమ్మ సినిమాలో,' రాంబాబు, ఎలా ఉందా సౌండ్? 
బాబ్బాబు అని 


అడుక్కున్నట్టు లేదు? , అన్న స్వాతి మాటలు గుర్తొచ్చి, నీ పేరుకు అంత బిల్డ్ అప్ అవసరమా బాబు, 


అనుకుంటూ నవ్వుకున్నాను.

కుర్రకారుకు అమ్మాయిల దృష్టిలో పడాలని తాపత్రయం. అందుకు కారు కూతలు కూసో, బైక్ 
మీద విన్యాసాలు 


చేసో, ఒక పాట పాడో, డాన్సు చేసో, తిప్పలు పడుతుంటారు. పాపం వీళ్ళ కష్టాలు ఈ మధ్య బాగా 


పెరిగిపోయాయట. కారణం, అమ్మాయిలు ముసుగులు వేసుకోవడం. అన్నీ ముసుగులా మధ్య వాళ్ళు 


వెంటబడాలని తీర్మానించుకున్న ముసుగు ఏదో గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉందట. మెల్లిగా, 'ఒరేయ్ బావ, తెల్ల 


చుక్కల నల్ల

ముసుగు నీది, ఎర్రచారాల పచ్చముసుగు నీది ' అనుకుంటూ సరిపెట్టుకున్తున్నారట. ఒక 
వేళ అమ్మాయిలు 


ముసుగు మార్చుకున్నా పరవాలేదు, మన వాళ్ళు చాలా adoptive . వాళ్ళు కూడా ముసుగులు ధరించేసి, 


కొన్నాళ్ళు అమ్మాయిలని యేడిపించేయ్యగలరు.

ఇల్లాళ్ళకి అందరి దృష్టిలో పడిపోవాలని తాపత్రయం. అందుకోసం కొందరు మంచి 
ముగ్గులేసి, కొందరు బాగా 


వంట చేసి, కొందరు చీరలు అమ్మి, కొందరు హస్త కళలు చూపించి, కొందరు బాగా అలంకరించుకుని 


కష్టపడుతుంటే, పద్మిని వంటి గడుసు వాళ్ళు బ్లాగ్లు పెట్టేసి, తెగ రాసేసి, చావగొడుతుంటారు. మరి కొందరు 


మీడియా వాళ్ళని ఇళ్ళకి పిలిచి, వంటలు చేసి, పాటలు పాడి, పూజలు చేసి చూపించి సరదా తీర్చుకుంటారు. 


పాపం ఆ anchor ల పరిస్థితి చూడాలి, వంటలు ఎంత ఛండాలంగా ఉన్నా 'చాలా బాగుందండి, తోటకూర పుట్ట 


గొడుగు కూర' అంటూ మెచ్చుకుంటారు.

అది చూసే వాళ్ళంతా ఆ వంట చేసి, చేతులు కాల్చుకుంటారు.


మా అపార్ట్మెంట్ లో ఒక ' కాల పురుషుడు' ఉన్నాడండి. అది మేము పెట్టుకున్న నిక్ 
నేమ్. మా అందరికీ 


పూజారి, కం ఉపన్యాసకుడు కం పాటగాడు, కం ఆటగాడు కం విదూషకుడు కం వంటవాడు. ఇన్నెలా చేస్తాడండి? 


అంటారా, అవకాశాన్ని బట్టి ,ఒక్కోసారి ఒక్కో అవతారం ఎత్తుతాడు, మైక్ దొరికితే చాలు మైకాసురుడు లాగ 


వోదలడు. ఆయన నూతన సంవత్సర ప్రసంగం, ' కాంప్లెక్స్ వాసులు అందరికీ, కాలం ఎంతో విలువయినది. కాలం

పొతే మళ్ళి రాదు( నీకిదేమి పోయేకాలం రా, బాబు), కాలం కలకాలం ఉండదు, 
జారిపోతుంది. కాల పురుషుడు 


అందరిని మిన్గేస్తుంటాడు.(నీ లాగ నా), ఇప్పుడు, పోయిన సంవత్సర కాలం పోయింది, కొత్త సంవత్సరం వస్తాది. 


ఈ కాలాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవాలి.....' అంటూ చెప్పుకుంటూ పోతుంటే, ఎవరో పుణ్యాత్ములు 


,ఆయన్ని పక్కకి మోసుకు పోయి, నోరు మూసేసి, మైక్ లాగేసుకున్నారు. మొన్న రామ నవమికి ఆయనే

పూజారి, పుస్తకం తెచ్చుకు చదివేశాడు, ప్రసాదాల వంట వాడు, ఎంతయినా సమరోత్సాహం 
ఆయనది, దృష్టిలో 


పడాలని.

క్రికెట్ మ్యాచ్ లో చూస్తుంటాం. రంగు రంగుల విగ్గులు, ప్లకార్డ్లు పట్టుకుని 
కొందరు నాట్యమాడుతుంటే, కొందరు 


అరిచి గగ్గోలు పెడతారు. కొందరు నున్నటి బోడి గుండు మీద వాళ్ళ దేశపు జండా రాయించుకుని కూర్చుంటారు. 


కొందరు బుగ్గ మీద టాటూ వేయించుకుంటారు. కళా పోషకులయిన కెమేర మాన్లు బోడి గుండుకి, బుగ్గ బొమ్మకి 


సమాన న్యాయం చేస్తారు. సినిమా వాళ్ళు, సీరియల్ వాళ్ళు జనాలకి రకరకాల పోటీలు పెట్టి దృష్టిలో పడితే, 


రాజకీయ నాయకులు ఒకరినొకరు బండ బూతులు తిట్టుకుంటూ, దృష్టిలో పడతారు.

మీరు కూడా దృష్టిలో పడాలనుకుంటున్నారా ? నా దగ్గరొక బ్రహ్మాండమయిన ఐడియా 
ఉందండి. like కొట్టి 


కామెంట్ చెయ్యండి మరి, అంతే.

No comments:

Post a Comment