Thursday, May 3, 2012

వంట వాడు

వంట  వాడు 






పిల్లల్ని చదివించి, వాళ్ళు ఉద్యోగాల కోసం విదేశాలకు ఎగుమతి అయ్యాక, ఒంటరిగా మిగిలిన ఒక పెద్దావిడ, 


వంట వాడి కోసం చూస్తోంది. భారతావనిలో ఇప్పుడు పని వాళ్ళ సంక్షోభం కదండీ, ఎంతో ప్రయత్నించాక, చివరికి 


'భీమయ్య' అనే వంటవాడు దొరికాడు.

కాని అతనికో చిన్న బలహీనత. సినిమాలు చూసి చూసీ, రోజూ తనను తాను ఏదో ఒక సినిమాలోని పాత్రగా 


ఊహించుకుని, ఆ పాత్రలో లీనమయిపోయి, ఆ డైలాగ్ లు చెబుతూ తిరుగుతుంటాడట. అప్పుడు 'విశ్రాంతి' కార్డు 


లేక 'శుభం' కార్డు చూపిస్తే మళ్ళిమన ప్రపంచం లోకి వచ్చేస్తాడట. అది అంత పెద్ద సమస్య కాదు అనుకున్న 


పెద్దావిడ భీమయ్యను పనిలో పెట్టుకుంది.

వస్తూనే 'వచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టిన్టికొచ్చా, నీ వంటిన్టికోస్తా 
చూసుకుందామా, నీ ప్రతాపమూ, నా 


ప్రతాపమూ, ' అంటూ మొదలుపెట్టాడు. విశ్రాంతి కార్డు చూపించింది పెద్దావిడ. ఇక ఆ పూట వంటకి 'వంకాయ 


కూర' చెయ్యమని చెప్పింది. భీమయ్య బెండకాయలు తీసాడు. తిక్కతో పాటు చెవుడు కూడా ఉందేమో 


అనుకున్నపెద్దావిడ, అదేవిటని అడిగితే,'సీతయ్య, ఎవ్వరి మాటా వినడు' అంటూ తల పంకించాడు.

మళ్ళి విశ్రాంతి కార్డు చూపించి, 'బాబు, నువ్వు సీతయ్య వి కాదు 
భీమయ్యవి' అంటూ సముదాయించి, ఆ 


పూటకి ముగించింది. ఏ మాటకు ఆ మాట, వంట బాగా చేసాడు భీమయ్య. ఏదో కొంత సర్దుకుపోతే పరవాలేదులే 


అనుకుంది పెద్దావిడ.

సాయంత్రం పెరట్లో గడ్డి మొక్కలు పీకుతున్న పెద్దావిడ దగ్గరకు భీమయ్య కంగారుగా 
వచ్చి, 'మొక్కే కదా అని 


పీకేస్తే పీక కోస్తా..' అంటూ ఆవేశంగా నిలుచున్నాడు.

వంకాయ కూర రుచి గుర్తు తెచ్చుకుంటూ, విరామం కార్డు చూపించింది పెద్దావిడ.


పుచ్చకాయ కోయ్యమని చేతిలో పెట్టింది. 'పుచ్చ పగిలిపోద్ది..' అంటూ పుచ్చకాయ కేసి చూడడం 



మొదలుపెట్టాడు భీమయ్య, 'కత్తులతో కాదు, కంటి చూపుతో కోసేస్తా', ఆవేశంగా అంటున్నాడు ,భీమయ్య. ఈ 


సారి వాడి మెడలోనే తగిలించిన విశ్రాంతి కార్డు చూపించింది పెద్దావిడ. రాత్రి ఇడ్లీ లోకి కొబ్బరికాయ పచ్చడి 


చెయ్యమని చెప్పింది. 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో, వాడే పండుగాడు..' అంటూ 


ఆవేశంగా కొబ్బరికాయ కొడుతున్నాడు వాడు. గోడ మీద అంటించిన విశ్రాంతి కార్డు చూపించింది పెద్దావిడ. 


మొత్తానికి ఆ రోజు అలా గడిచింది భీమయ్య తో.

మర్నాడు సాంబార్ లోకి ఆనపకాయ కోయ్యమని ఇచ్చింది. 'అమ్మా తోడు, అడ్డంగా 
నరికేస్తా..' అంటూ 


ఆనపకాయని అడ్డంగా, కసిగా తరిగేస్తున్నాడు భీమయ్య. మళ్ళి పెద్దావిడ ...అదన్నమాట. 'ఒరే ఉల్లిపాయ అటు 


పక్క కుళ్ళిపోయింది, చూసుకోవేం ' అంటూ మందలించింది.'చూడు, ఒక వైపు చూడు, రెండో వైపు చూడకు, 


తట్టుకోలేవు' అంటూ మొదలుపెట్టాడు. స్టవ్ మీద అంటించిన కార్డు చూపించింది ఆవిడ. ఇంక సాంబార్

మొదలుపెట్టి, తీర్ధం లో కొన్న బొమ్మ కెమేర తో ఫోటోలు తీసినట్టు, వెనకాల ఏదో
రాసినట్టు చేస్తూ, మాడిపోతున్నా 


పట్టించుకోవట్లేదు భీమయ్య. పెద్దావిడకు ఏమి అర్ధం కాలేదు. ఎంత అరచినా వెర్రి చూపులు తప్ప స్పందన లేదు,

చివరకు విరామం కార్డు చూపించాక చెప్పాడు, తను గజినీ పాత్ర లో లీనమయ్యానని, 
అందుకే డైలాగ్ లు లేవు, 


వంట కూడా చూడడం మరచిపోయానని. ఇక శుభం కార్డు చేతికిచ్చి పంపేసింది పెద్దావిడ.

No comments:

Post a Comment