Thursday, May 3, 2012

వద్దు


వద్దు 





మీరు ఎన్నయినా చెప్పండి, వద్దన్న పని చెయ్యడంలో భలే సరదా ఉంది. అలా వద్దన్నపని చేసి ఎదుటివాళ్ళను 


ఉడికించడంలో మంచి వినోదం ఉంది. ఏంటండి? మీరెప్పుడు వద్దన్న పని చెయ్యలేదా? 'రాముడు మంచి బాలుడు 


'వంటి వారా? అయితే చదవండి, క్రింది వాటిలో ఒక్కటయినా తప్పకుండా మీరు చేసే ఉంటారు.


చిన్నప్పుడు అమ్మ ఆడుకోవద్దు, జంతికల డబ్బా తియ్యద్దు,చెట్లు ఎక్కద్దు, గోడ ఎక్కద్దు,అంటూ, ఇప్పటి 


అమ్మలయితే కార్టూన్లు చూడద్దు అంటూ ఉంటారు కదా. అలా వద్దన్న కొద్దీ పిల్లలు ఆడుకోవడానికి, కార్టూన్లు 


చూడడానికి మరింత ఆసక్తి చూపుతారు. అందుకే, ఇలాంటి విషయాల్లో అపసవ్యదిశను వాడాలండి. అంటే 


ఆడుకొమ్మని, అన్నీ తినమని చెప్పాలన్న మాట. మా అమ్మయితే నన్ను అలగద్దని చెప్పేది. తను చెప్పెకొద్దీ 


నేను ఇంకాస్త ఎక్కువ అలిగేసి, ఒక మూల పేపర్, పెన్సిల్ తీసుకుని బొమ్మలు గీసుకునే దాన్ని. అందుకే నాకు 


చిత్రలేఖనం ఎవరి వద్దా నేర్చుకోకుండానే అబ్బింది. అలక వల్ల ప్రయోజనం అన్నమాట.



ఇక యువత బుద్ధిగా ఉండమని, ప్రేమ వ్యవహారాల్లో పడకుండా చక్కగా చదువుకొమ్మని, 
పరీక్షల్లో కాపీ కొట్టద్దని, 


బైక్ల మీద దూకుడుగా వెళ్లోద్దని, నడిచే బస్సు ఎక్కద్దని, పదే పదే చెప్పించుకుని, గడప దాటగానే, ఈ చెవితో 


విన్నవి ఆ చెవితో వదిలేస్తారన్నమాట. ఇల్లాళ్ళు వద్దన్న కూర వండి, తమ తిరుగుబాటును ప్రకటిస్తారు.

ఇరుగు పొరుగు వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే, వాళ్ళ గుమ్మం దగ్గర చెత్త వేసి మరీ 
కసి తీర్చుకుంటారు. 


మగవాళ్ళు బాస్ లేట్ గా రావద్దని ఎంత గింజుకున్నా, ఒక్క ఐదు నిముషాలయినా లేట్ గా వెళ్లి, బాస్ మీద 


ప్రతీకారం తీర్చుకుంటారు.

ప్రభుత్వోద్యోగులు లంచాలు తీసుకోవద్దని ఎంత మొత్తుకున్నా, అమ్యామ్యాలు 
దండుకుంటూనే ఉంటారు. పదవి 


లో ఉన్న రాజకీయ నాయకులు స్కాం ల ద్వారా, డ్యాం ల ద్వారా, వీలుంటే గడ్డి ద్వారా కూడా, వదలకుండా 


కాసులు కూడబెట్టుకుంటారు. రైడ్ లు అయితే బెంగ పెట్టుకుంటారు. అసెంబ్లీ లో గొడవలు పెట్టుకుని 


అమూల్యమయిన సభా సమయాన్ని వృధా చేయ్యోద్దంటే, మంచి నీళ్ళ పంపు దగ్గర బిందెల వాళ్ళలా,

కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఇంకా ఒకళ్ళ గుట్టు ఒకళ్ళు బయట 
పెట్టుకుంటారు. గుడిలో డబ్బులు కేవలం 


హుండిలోనే వెయ్యమంటే, మనం తప్పక పూజారి పళ్ళెం లోనే వేస్తాం.మరి సినిమా వాళ్ళు తమను అనుకరించ 


వద్దని, ఫైరసి వద్దని ఎంత వేడుకున్నా, ప్రయోజనం ఉండదు.

ట్రైన్లో సిగరెట్టే కాల్చకూడదంటే, కాల్చే ప్రబుద్ధులని చూస్తున్నాం. హెల్మెట్ 
లేకుండా బండి నడపద్దంటే, నడిపెస్తాం. 


మొబైల్ డ్రైవింగ్ లో వాడద్దంటే, రోడ్డు మీద సగం మంది, వాతం కమ్మిన కోళ్ళలా, బుర్ర ఒక పక్కకి వంచుకుని, 


మాట్లాడుతూ నడపడం చూస్తుంటాం. వాళ్ళ సరదా, ట్రాఫ్ఫిక్ పోలీసు పట్టుకున్నా తీరదు. రోడ్డు మీద ఓవర్టెక్ 


చెయ్యొద్దని, అతి వేగంగా నడపకూడదని చెప్పే సూత్రాలని, కేవలం ఆవులు, గేదెలు, మేకలు మాత్రమే 


పాటిస్తాయి.

చివరగా, బాహాటంగా ప్రేమను పంచడం, పబ్లిక్ డిస్ప్లే అఫ్ అఫ్ఫెక్షన్, నేరమని ఎంత 
చెప్పినా, చెరువు గట్ల వెంట, 


బైక్ ల మీద, ప్రేమ జంటలు శ్రుతి మించి, పరిసరాలు మరచి, మైమరచి పోవడం చూస్తున్నాం. వీళ్ళ తిక్క 


శివసేన వాళ్ళు మంగళ సూత్రాలు పట్టుకు వెంటబడే దాకా తీరదు.

No comments:

Post a Comment